AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంకే..

బరువు పెరగకూడదని పండ్లు, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్ మాత్రమే తింటున్నారా? అయినా సరే వెయిట్ మిషన్ పై మీ బరువు చూస్తే గుండె గుభేల్ మంటోందా? హెల్తీ ఫుడ్ తింటే బరువు పెరగరు అనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని మీకు తెలుసా? అవును.. మీరు తింటున్నది ఎంత పోషకమైన ఆహారమైనప్పటికీ.. మీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని విషయాలను మార్చుకోకపోతే ఊబకాయం బారిన పడక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Eating Healthy But Still Gaining WeightImage Credit source: AI Image
Krishna S
|

Updated on: May 31, 2026 | 7:49 AM

Share

చాలా మంది తాము ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారమే తింటున్నామని, అయినా సరే బరువు ఎందుకు పెరుగుతున్నామో అర్థం కావడం లేదని అంటుంటారు. ‘‘నేను జంక్ ఫుడ్ తినను, ఆయిల్ ఫుడ్ ముట్టను.. అయినా వెయిట్ గెయిన్ అవుతున్నా’’ అనేది చాలా మంది లబోదిబోమనే మాట. అయితే బరువు పెరగడానికి కేవలం ఆహారం మాత్రమే కాదు.. మన జీవనశైలిలోని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా కారణం అంటున్నారు నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పెరిగిన BMI, ఊబకాయం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా, పెద్దల్లోనే కాకుండా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో కూడా ఊబకాయం కేసులు ఆందోళనకరంగా పెరిగాయి. మరి హెల్తీ ఫుడ్ తిన్నా బరువు పెరగడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హెల్తీ ఫుడ్డే కదా అని అపరిమితంగా తినేస్తున్నారా?

ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి మేలు చేస్తుందనేది నిజమే.. కానీ దానిని ఎంతైనా తినవచ్చని అనుకుంటే పొరపాటే! డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, గ్రానోలా, పీనట్ బటర్ వంటి పోషకమైన ఆహారాలలో కూడా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోర్షన్ కంట్రోల్ లేకపోతే శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు చేరి, బరువు పెరగడానికి దారితీస్తుంది.

లెక్కల్లోకి రాని లిక్విడ్ కేలరీలు

మనం లంచ్, డిన్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ.. రోజంతా తాగే టీలు, కాఫీలు, స్వీట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లను పెద్దగా పట్టించుకోం. ఈ పానీయాల ద్వారా శరీరంలోకి వెళ్లే అదనపు కేలరీలను మనం తరచుగా గమనించము. ఫలితంగా మొత్తం కేలరీల వినియోగం పెరిగి, బరువు నెమ్మదిగా పెరుగుతూ పోతుంది.

తిండి ఓకే.. మరి శారీరక శ్రమ ఏది?

మంచి ఆహారం మరియు క్రమమైన వ్యాయామం అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివి. మీరు ఎంత సమతుల్య ఆహారం తీసుకుంటున్నప్పటికీ, రోజంతా ఒకే చోట కూర్చుని గడిపితే శరీరం కేలరీలను ఖర్చు చేయలేదు. బరువు అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా తేలికపాటి వ్యాయామం తప్పనిసరి.

నిద్ర లేకపోవడం.. హార్మోన్ల గందరగోళం

నిద్రకూ, బరువుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది. రోజుకు తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల జీవక్రియ మందగించడమే కాకుండా.. అర్ధరాత్రుళ్లు లేదా పగటిపూట ఎక్కువగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది.

సైలెంట్ కిల్లర్ ఒత్తిడి

ఆధునిక కాలంలో ఒత్తిడి అనేది కామన్‌గా మారిపోయింది. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఈ హార్మోన్ వల్ల ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అలాగే ఇది ఎక్కువగా తినాలనే కోరికను పెంచడంతో పాటు శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. ఫలితంగా బరువు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.

బరువును అదుపులో ఉంచుకోవడానికి చిట్కాలు

  • ఆహారం ఆరోగ్యకరమైనదైనా.. సరైన మోతాదులోనే తీసుకోండి.
  • ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం మానుకోండి. ప్రతి గంటకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి.
  • మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ (పీచు పదార్థం) పరిమాణాన్ని పెంచండి.
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి.
  • ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోండి.

బరువు తగ్గడం అంటే కేవలం డైటింగ్ చేయడం మాత్రమే కాదు బాస్.. అదొక సంపూర్ణ జీవనశైలి మార్పు. సరైన ఆహారంతో పాటు సరైన నిద్ర, వ్యాయామం తోడైనప్పుడే ఫిట్‌నెస్ సాధ్యమవుతుంది.

Follow Us