Side Effects of Curd: రాత్రిపూట పెరుగు తింటే ఇంత డేంజరా..? మర్చిపోయి తిన్నారంటే..

పెరుగు ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఆహారం. ప్రతి ఒక్కరూ తినవచ్చు.. కానీ మోతాదు తప్పక పాటించాలి. పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. కానీ, రాత్రిపూట మాత్రం పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో పెరుగు తినకపోవడమే మంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాల కోసం డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

Side Effects of Curd: రాత్రిపూట పెరుగు తింటే ఇంత డేంజరా..? మర్చిపోయి తిన్నారంటే..
Eating Curd At Night

Updated on: Oct 22, 2025 | 5:50 PM

పెరుగు చల్లదన గుణం కలిగి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో తింటే శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, శక్తి ఉత్పత్తి, జీర్ణక్రియకు సహాయపడే విటమిన్​ బి2, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్​ బి12, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం, లాక్టిక్​ ఆమ్లం, ప్రోబయోటిక్స్ వంటివి పెరుగులో చాలానే ఉన్నాయి.

పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తింటే జీర్ణక్రియ మరింత మెరుగవుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం కల్పిస్తుంది. పెరుగు శరీర శక్తిని పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. కానీ, రాత్రిపూట తింటే జలుబు, దగ్గు, కఫ సమస్యలు రావచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా చలి కాలంలో ఉదయం, రాత్రి పెరుగు తినకపోవడమే మంచిదని అంటున్నారు.

రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఇందులోని ప్రోటీన్, కొవ్వుల కారణంగా మీ జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తాయి. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు వస్తాయి. అలాగే, మూత్రపిండాల సమస్యలు ఉన్న రోగులు కూడా పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో భాస్వరం, పొటాషియం ఉంటాయి. ఇది మూత్రపిండాల రోగులకు హానికరం.

ఇవి కూడా చదవండి

పాలు లేదా పాల ఉత్పత్తులను జీర్ణం చేయడంలో మీకు ఇబ్బంది ఉంటే, ఈ పరిస్థితిని లాక్టోస్ అసహనం అంటారు. లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలు లేదా పాల ఉత్పత్తులను తిన్న 90 నిమిషాల నుండి 2 గంటలలోపు ఈ సమస్యను ఎదుర్కొంటారు. పాలు లేదా పెరుగును జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ లాక్టేజ్ లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానేయాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..