లేట్ నైట్ బిర్యానీ తింటున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.. డైటీషియన్ల హెచ్చరిక!

బిర్యానీ అంటే చాలామందికి అత్యంత ఇష్టమైన ఆహారం. అయితే, రాత్రి పూట ఆలస్యంగా బిర్యానీ తినే అలవాటు ఉంటే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలో ఉండే అధిక కొవ్వు, నెయ్యి, నూనె మరియు ఘాటైన మసాలాలు అరిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా, రాత్రి ఆలస్యంగా బిర్యానీ తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి వేగంగా బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

లేట్ నైట్ బిర్యానీ తింటున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.. డైటీషియన్ల హెచ్చరిక!
Late Night Biryani

Updated on: Sep 18, 2026 | 8:34 PM

సమయం రాత్రి 10 దాటినా లేదా అర్ధరాత్రి వేళల్లో అయినా వేడివేడి బిర్యానీ అనగానే నోట్లో నీళ్లు ఊరడం సహజం. మనదేశంలో లేట్ నైట్ బిర్యానీ తిని పడుకునే అలవాటు చాలామందికి ఉంది. అయితే, ఈ అలవాటు స్వల్పకాలంలో నోటికి రుచిని ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రాత్రివేళల్లో బిర్యానీ తింటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే ఆరోగ్య నష్టాలను ఇప్పుడు చూద్దాం..

తీవ్రమైన అజీర్తి, అసిడిటీ:

బిర్యానీ తయారీలో అధిక మొత్తంలో నూనె, నెయ్యి, ఘాటైన మసాలా దినుసులు ఉపయోగిస్తారు. రాత్రి సమయంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు సహజంగానే మందగిస్తుంది. అటువంటి సమయంలో బిర్యానీ తిని వెంటనే పడుకోవడం వల్ల అది సరిగ్గా అరగక అసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, పుల్లటి తేన్పులు వస్తాయి.

వేగంగా బరువు పెరగడం:

బిర్యానీలో రిఫైండ్ రైస్, కొవ్వు పదార్థాల వల్ల క్యాలరీలు అత్యధికంగా ఉంటాయి. పగటిపూట తింటే శారీరక కదలికల ద్వారా ఆ క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, రాత్రి తిని పడుకోవడం వల్ల ఆ క్యాలరీలన్నీ కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి. ఇది వేగంగా బరువు పెరగడానికి, పొట్ట రాడవడానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి సమస్యలు:

భారీగా మసాలా ఉన్న ఆహారం రాత్రిపూట తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణక్రియ కోసం జీర్ణాశయం నిరంతరం శ్రమించడం వల్ల గాఢ నిద్ర పట్టదు. దీనివల్ల రాత్రివేళల్లో పదేపదే మెలకువ రావడం, ఉదయానికి అలసటగా అనిపించడం జరుగుతుంది.

డయాబెటిస్, కొలెస్ట్రాల్ ప్రమాదం:

రాత్రి ఆలస్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బిర్యానీ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది క్రమంగా ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

డైటీషియన్ల సూచన:

ఒకవేళ మీరు బిర్యానీ తినాలనుకుంటే, మధ్యాహ్న భోజనంలో తినడం ఉత్తమమైన ఎంపిక. రాత్రి పూట తినాల్సి వస్తే సంధ్యా సమయంలో లేదా రాత్రి 7 నుండి 8 గంటల లోపే ముగించాలి. బిర్యానీ తిన్న తర్వాత కనీసం 2 నుండి 3 గంటల వ్యవధి ఇచ్చి ఆ తర్వాతే నిద్రపోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us