Summer Heat: ఎండలో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ వాడుతున్నారా..! అది ఎంత డేంజరో తెలుసా..?

|

Apr 22, 2023 | 10:43 AM

మొబైల్ లేకుండా జీవించడం కష్టం. కొంతమంది ఫోన్ లేకుండా బయట అడుగు పెట్టరు. బస్‌లో ఉన్నా, బైక్‌పై వెళ్లాలన్నా, రోడ్డుపై వెళ్తున్నప్పుడూ కూడా ఫోన్‌ చూడటం మామూలైపోయింది. మొబైల్ అనివార్యమైన ఈ రోజుల్లో మొబైల్ వాడకుండా ఉండటమనేది చాలా కష్టం. కాబట్టి వేసవిలో మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలను ఇక్కడ తెలుసుకుందాం..

Summer Heat: ఎండలో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ వాడుతున్నారా..! అది ఎంత డేంజరో తెలుసా..?
Summer Heat
Follow us on

దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఎండ వేడిమి పెరుగుతోంది. ఉదయం 10దాటిందంటే చాలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటేనే జనం భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వేసవి తాపంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. నెత్తిమీద ఎండలు మండుతుండడంతో ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. ఎండవేడిమి కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం సరికాదు. ముఖ్యంగా ఎండలో ఫోన్ వాడటం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. కిరాణా, లైట్ బిల్లు, నీటి బిల్లు, చెల్లింపు అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే లభిస్తాయి. కాబట్టి మొబైల్ లేకుండా జీవించడం కష్టం. కొంతమంది ఫోన్ లేకుండా బయట అడుగు పెట్టరు. బస్‌లో ఉన్నా, బైక్‌పై వెళ్లాలన్నా, రోడ్డుపై వెళ్తున్నప్పుడూ కూడా ఫోన్‌ చూడటం మామూలైపోయింది. మొబైల్ అనివార్యమైన ఈ రోజుల్లో మొబైల్ వాడకుండా ఉండటమనేది చాలా కష్టం. కాబట్టి వేసవిలో మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఎప్పుడూ మొబైల్ వాడినా ఫర్వాలేదు. అయితే ఎండలో ఫోన్ వాడితే కళ్లకు పెద్ద ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఫోన్‌ని చూడటం వల్ల కంటి సమస్యలు, చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా ఫోన్ స్క్రీన్ పై పడతాయి. ఆ సమయంలో సూర్యకిరణాలు కంటి రెటీనాపై పరావర్తనం చెందుతాయి. ఇది రెటీనా వెనుక ఉన్న మాక్యులాను దెబ్బతీస్తుంది. ఇది అంధత్వానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అవసరం లేనప్పుడు మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి: ఫోన్ వేడెక్కడానికి బాహ్య ఉష్ణోగ్రత ఒక్కటే కారణం కాదు. అలా కాకుండా మొబైల్ ఎక్కువగా వాడినా మొబైల్ వేడెక్కుతుంది. మీరు గేమ్‌లు ఆడుతున్నట్లయితే లేదా ఎక్కువ కాల్స్ చేస్తున్నట్లయితే, మీ ఫోన్‌ని ఎక్కువ పని చేయించినట్టే..దీంతో మరింత వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది చుట్టూ ఎండవేడిమితో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇది వేడెక్కడానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఫోన్ ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి. అలాగే, గేమ్‌ల వంటి ప్రాసెసర్-ఇంటెన్సివ్ అప్లికేషన్‌లను ఉపయోగించడం ఆపివేయండి. అలాగే మీ ఫోన్‌ని ఎక్కువ సమయం కారులో ఉంచరాదు. 95-డిగ్రీల రోజున ఎండలో పార్క్ చేసిన కారు కేవలం ఒక గంటలో 116 డిగ్రీలకు చేరుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఆపిల్ 95 డిగ్రీల కంటే ఎక్కువ ఐఫోన్‌ను ఉపయోగించకూడదని సిఫార్సు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కడం మీరు గమనించవచ్చు. అలాగే ఎండ ఉష్ణోగ్రతలలో ఛార్జ్ చేయడం వల్ల అది వేడెక్కుతుంది. అందువల్ల, నేరుగా సూర్యకాంతి తగిలే ప్రదేశంలో ఫోన్‌ను ఛార్జ్ చేయవద్దు. వేసవి వేడి మొబైల్‌ని మరింత వేడి చేస్తుంది. అది మీ ఫోన్ బ్యాటరీకి పవర్‌ని ట్రాన్సఫర్‌ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావం. దాని వల్ల ఫోన్ సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది.

ఫోన్‌ని ఏ రకమైన దిండు, దుప్పటి లేదా ఇతర వార్మింగ్ మెటీరియల్ కింద పెట్టుకోవద్దు. వేడిగా ఉన్న రోజున ఛార్జింగ్ ఫోన్ ద్వారా విడుదలయ్యే వేడిని ఈజీగా బయటకు వెళ్లకుండా అడ్డుగా ఏదైనా కప్పిఉంచటం వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు.

ఎక్కువ సేపు వాడిన తర్వాత, ఫోన్ టెంపరేచర్ వల్ల ఎక్కువ వేడెక్కితే స్విచ్ ఆఫ్ చేయడం మంచిపని. కాసేపు చల్లని ప్రదేశంలో ఉంచండి. తద్వారా ఇది గది ఉష్ణోగ్రతకు తిరిగి వస్తుంది. అప్పుడు మొబైల్‌ని మళ్లీ ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..