Cold water health issues: వేసవి అని ఫ్రిజ్‌ వాటర్ తాగుతున్నారా.. జాగ్రత్త..? ఈ దుష్ప్రభావాలు తెలుసుకోండి..

|

Apr 13, 2024 | 10:15 AM

చల్లటి నీరు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మందికి తెలియదు. ఇది మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండెను కూడా దెబ్బతీస్తుంది. వేడి నుండి ఉపశమనం పొందడానికి తరచుగా చల్లటి నీటిని తాగుతున్నట్టయితే.. చల్లని నీటి వల్ల కలిగే కొన్ని తీవ్రమైన సమస్యల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.

Cold water health issues: వేసవి అని ఫ్రిజ్‌ వాటర్ తాగుతున్నారా.. జాగ్రత్త..? ఈ దుష్ప్రభావాలు తెలుసుకోండి..
తీవ్రమైన ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఒక్కోసారి మూర్ఛ సంభవించి, కోమాకు కూడా దారి తీస్తుంది. ఊపిరితిత్తులలో నీరు చేరి శ్వాస ప్రక్రియ దెబ్బతింటుంది. కిడ్నీ వ్యాధి, గుండె వైఫల్యం వంటి సమస్యలున్న వారు ఎక్కువ నీరు అధికంగా తాగితు ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది.
Follow us on

ఎండాకాలం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎండల తీవ్రత కారణంగా వేసవిలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చర్మంపై దద్దుర్లు మొదలు.. పెద్ద కిడ్నీ వ్యాధుల వరకు వేసవిలో కనిపిస్తాయి. ఈ సమయంలో పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత.. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం చాలా మందికి అలవాటు. ఇలా ఎండకు వెళ్లి వచ్చిన వెంటనే.. ఇలా చల్లటి నీళ్లు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. వేడిని తొలగిస్తుంది. కానీ, ఇది కేవలం స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. ఈ సమయంలో చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. చల్లటి నీరు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మందికి తెలియదు. ఇది మీ బరువును పెంచడమే కాకుండా మీ గుండెను కూడా దెబ్బతీస్తుంది. వేడి నుండి ఉపశమనం పొందడానికి తరచుగా చల్లటి నీటిని తాగుతున్నట్టయితే.. చల్లని నీటి వల్ల కలిగే కొన్ని తీవ్రమైన సమస్యల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.

జీర్ణ సమస్యలు..

చల్లటి నీరు మీ జీర్ణవ్యవస్థపై వేగవంతమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. చల్లటి నీరు శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉండకపోవడం, శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కడుపులో ఆహారం జీర్ణం కావడం కష్టతరం కావడం దీనికి కారణం.

తలనొప్పి..

తరచుగా శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల మెదడు స్తంభింపజేస్తుంది. ఐస్ వాటర్ తాగడం, ఐస్ క్రీం ఎక్కువగా తినడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతుంది. నిజానికి, మెదడును ప్రభావితం చేసే వెన్నుపాములోని సున్నితమైన నరాలను చల్లటి నీరు చల్లబరుస్తుంది. ఇది తలనొప్పి, సైనస్ సమస్యలను కలిగిస్తుంది.

బరువు పెరుగుతోంది..

మీరు బరువు తగ్గాలనుకుంటే అనుకోకుండా కూడా చల్లని నీరు తాగకండి. చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలనుకుంటే, చల్లని నీటికి దూరంగా ఉండండి.

గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది..

చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి నీరు అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోతుంది. ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు చల్లటి నీరు తాగడం మానేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…