పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే రెగ్యులర్‌గా తీసుకునే భోజనంతో పాటు పండ్లను కచ్చితంగా భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఏదో ఒక రకమైన పండును తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే రాత్రి పండ్లను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని చెబుతుంటారు. ఇంతకీ రాత్రి పడుకునే ముందు ఎలాంటి పండ్లు తీసుకోకూడదు.? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* సాధారణంగా రాత్రి పడుకునే ముందు అరటి పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. అయితే ఇందులోని సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. దీని కారణంగా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో గొంగు వాపునకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు.
* రాత్రి పడుకునే ముందు తీసుకోకూడని మరో పండు పైనాపిల్. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థలో చికాకు, మంటను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా రాత్రిళ్లు కడుపులో ఏం లేకుండా పైనాపిల్ తీసుకుంటే గుండెలో మంట, నిద్రలేమికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* సపోటా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు తీసుకోకూడదు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారనమవుతాయి. ఇది నిద్ర భంగానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* రాత్రి పడుకునే ముందు వాటర్ మిలాన్ తీసుకోకూడదు. అయితే దీనివల్ల పెద్దగా ఆరోగ్య సంబంధిత సమస్యలు లేకపోయినా.. ఇందులోని వాటర్ కంటెంట్ కారణంగా రాత్రుల్లు తరచూ మూత్ర విసర్జనకు దారి తీస్తుంది. ఈ కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది.
* జామకాయలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే జామకాయ తింటే గ్యాస్ సమస్య వేదిస్తుంది.
* యాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. అయితే రాత్రి పడుకునే ముందు యాపిల్ తినడం వల్ల ఎసిడిటీకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రి యాపిల్‌కు దూరంగా ఉండడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..