Health: పాదాల నుంచి ఈ రకమైన వాసన వస్తుందా.? వెంటనే అలర్ట్ అవ్వండి..
ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాదాల నుంచి వచ్చే వాసన ఆధారంగా శరీరంలో ఉన్న వ్యాధుల గురించి అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాదాల నుంచి వెనిగర్‌ను పోలిన స్మెల్...

ఆహారపు అలవాట్లలో మార్పులు, గాడితప్పిన జీవనశైలి కారణంగా ఇటీవల వ్యాధుల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న వయసులోనే దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఎలాంటి వ్యాధి శరీరంలో ప్రవేశించిన దానిని తెలపడానికి ముందుగానే శరీరం మనకు కొన్ని లక్షణాల ద్వారా సూచిస్తుంది. శరరీంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు.
ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాదాల నుంచి వచ్చే వాసన ఆధారంగా శరీరంలో ఉన్న వ్యాధుల గురించి అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాదాల నుంచి వెనిగర్‌ను పోలిన స్మెల్ వస్తే వెంటనే అలర్ట్ కావాలని అది మధుమేహం లేదా కిడ్నీ సంబంధిత సమస్యలకు కారణమని భావించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. పాదాలకు విపరీతమైన చెమట పట్టడం, పాదాల నుంచి వెనిగర్ లాంటి వాసన తరచుగా వెలువడడానికి లైట్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రమాదకరమని చెబుతున్నారు. సాధారణంగా టీనేజర్లలో హార్మోన్ల మార్పుల కారణంగా విపరీతంగా చెమటలు పడుతాయి. మధుమేహం లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల బారిన పడిన వారి చెమట కూడా వెనిగర్ లాగా వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే డయాబెటిస్ లేదా థైరాయిడ్ ఉన్న వారిలో కూడా తక్కువ వ్యవధిలో విపరీతంగా ఎక్కువ చెమటలు వస్తాయని చెబుతున్నారు. హైపర్‌హైడ్రోసిస్‌తో బాధపడుతున్న వ్యక్తులల్లో కూడా చెమటలు పడతాయని చెబుతున్నారు. పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో వీలైనంత వరకు ఎక్కువగా విటమిన్లు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
పాదాల శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజూ కనీసం రెండు సార్లు పాదాలను శుభ్రంగా నీటితో కడుక్కోవాలని సూచిస్తున్నారు. అలాగే నాణ్యమైన కాటన్ సాక్స్‌ను ధరించాలని చెబుతున్నారు. శరీరంలో చెమటను తగ్గించడానికి, మార్కెట్లో లభించే యాంటీపెర్స్పిరెంట్ వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




