Lifestyle: సమ్మర్‌లో స్కిన్‌ ఎలర్జీనా.. ఈ ఫుడ్‌కు దూరంగా ఉండండి..

|

Apr 06, 2024 | 5:05 PM

చర్మం సంబంధిత సమస్యలు ఉన్న వారికి సమ్మర్‌లో ఆ సమస్యలు మరింత ఎక్కువవుతాయని తెలిసిందే. చెమట ఎక్కువగా పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం కారణం ఏదైనా సమ్మర్‌లో స్కిన్‌ సమస్యలు మరింత ఎక్కువుతాయి. అయితే సమ్మర్‌లో...

Lifestyle: సమ్మర్‌లో స్కిన్‌ ఎలర్జీనా.. ఈ ఫుడ్‌కు దూరంగా ఉండండి..
Skin Problem
Follow us on

చర్మం సంబంధిత సమస్యలు ఉన్న వారికి సమ్మర్‌లో ఆ సమస్యలు మరింత ఎక్కువవుతాయని తెలిసిందే. చెమట ఎక్కువగా పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం కారణం ఏదైనా సమ్మర్‌లో స్కిన్‌ సమస్యలు మరింత ఎక్కువుతాయి. అయితే సమ్మర్‌లో చర్మ సంబంధిత వ్యాధులకు తీసుకునే ఆహారానికి సంబంధం ఉంటుందని మీకు తెలుసా.? అవును సమ్మర్‌లో చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే సమ్మర్‌లో స్సైసీ, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహార పదార్థాలు శరీరంలో వేడి పెరగడానికి కారణమవుతుంది. దీంతో చర్మపై దురద, రింగ్‌వార్మ్‌ సమస్య ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీలైనంత వరకు వెన్న, పాలు, పెరుగువంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో దురద, రింగ్ వార్మ్‌ వంటి సమ్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* పుల్లటి ఆహారం కూడా స్కిన్‌ సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పుల్లని ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీరంలో పిత్తం పెరుగుతుంది. దీంతో శరీరంలో రక్తం కలుషితం అవుతుంది. ఇది దురద, రింగ్‌ వార్మ్‌ సమస్యకు కారణమవుతుందని సూచిస్తున్నారు.

* చర్మ సంబంధిత సమస్యలకు నువ్వులు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నువ్వులు వేడి స్వభావాన్ని కలిగిస్తాయి. ఇది శరీరం వేడెక్కడానికి కారణమవుతుంది. దీని కారణంగా స్కిన్‌ సంబధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* బెల్లం కూడా శరీరం వేడెక్కడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో బెల్లం తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని చెబుతున్నారు.

ఇవి పాటించండి..

దురద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పదే పదే గోకడం లాంటివి చేయకూడదు. అలాగే సమ్మర్‌లో రోజుకు రెండుసార్లు స్నానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే శుభ్రంగా ఉతికిన దుస్తులనే తీసుకోవాలి. పెరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని తీసుకోవాలని చెబుతున్నారు. సరిపడ నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..