Geyser: చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

|

Nov 18, 2024 | 12:41 PM

ప్రస్తుతం గీజర్ల వినియోగం అనివార్యంగా మారింది. దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో గీజర్లను ఉపయోగిస్తున్నారు. అయితే వాటర్‌ గీజర్లను ఉపయోగించే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Geyser: చలికాలంలో గీజర్‌ వాడుతున్నారా.? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
కొన్ని సార్లు గీజర్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే గీజర్‌ను ఉపయోగించేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. గీజర్‌ను ఆన్ చేసినప్పుడు, నీరు నిమిషాల వ్యవధిలో వేడెక్కుతుంది. దీని వల్ల సులభంగా స్నానం చేయవచ్చు. కానీ చాలా సార్లు దీన్ని ఆన్ చేసినప్పటికీ ఎక్కువసేపు ఆఫ్ చేయరు. ఇలా గీజర్ ఎక్కువ సమయం ఆన్‌లో ఉండటం అంత మంచిదికాదు.
Follow us on

క్రమంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇక చలికాలంటో స్నానం అనగానే చాలా మంది భయపడుతారు. చల్లటి నీటిలో స్నానం చేయడానికి అస్సలు మొగ్గు చూపరు. దీంతో వాటర్‌ గీజర్లను ఉపయోగిస్తుంటారు. అయితే గీజర్లను ఉపయోగించే క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేందుకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనలో కొందరు గీజర్లను గంటలతరబడి ఆన్‌లోనే ఉంచుతారు. గీజర్‌ ఆన్‌చేసి వేరు పనుల్లో బిజీ అవుతుంటారు. దీంతో ఆటో కట్‌ ఉన్న గీజర్లు అయితే వెంటనే రెడ్‌ బటన్‌ పడి గీజర్‌ ఆగిపోతుంది. అయితే ఇలా రెడ్‌ లైట్‌ పడిన తర్వాత ఎక్కువసేపు ఉంటే గీజర్‌ పాడయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏకంగా గీజర్‌ పేలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. అందుకే గీజర్‌ ఆన్‌ చేసిన తర్వాత కచ్చితంగా ఆఫ్‌ చేయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఇక తక్కువ ధరకు వస్తున్నాయని ఊరుపేరు లేని గీజర్లను కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల భవిష్యత్తుల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని తక్కువ ధరకు లభించే గీజర్లలో నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉంటాయి. ఇది గీజర్లు త్వరగా పాడవడానికి కారణమవుతాయి. అదే విధంగా గీజర్‌ పనితీరుపై ప్రభావం పడుతుంది.

గీజర్‌ను ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో గీజర్‌లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే గీజర్స్‌ అటుకుపై ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది. దీనివల్ల ఏదైనా ఊహించని పరిణామం ఎదురైనా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. చూశారుగా గీజర్‌ను ఉపయోగించే సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..