గరిటడైన చాలు గాడిద పాలు… ఇప్పుడు నెల నెలా లక్షలు సంపాదించే సరికొత్త మార్గం ఇదేనా?

తాజా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 142 ఫాంలు ఉన్నాయి. ఒక్కో ఫాంలో కనీసం 50 గాడిదలను సాకుతున్నట్టు లెక్కలు చూసినా దాదాపు దేశ వ్యాప్తంగా మరో 7 వేల గాడిదలు అదనంగా ఉండే అవకాశం ఉంది.

గరిటడైన చాలు గాడిద పాలు...  ఇప్పుడు నెల నెలా లక్షలు సంపాదించే సరికొత్త మార్గం ఇదేనా?
Software Engineers Started Donkey Milk Business

Updated on: Jul 02, 2024 | 10:15 AM

“గంగి గోవు పాలు గరిటెడైనచాలు – కడవడైననేమి కరము పాలు” ఇక మన వేమన శతకంలో  ఈ పద్యాన్ని తెలుగు వాళ్లం  పక్కన పెట్టెయ్యాలేమో… లేదంటే మొదటి రెండు పాదాలను తిప్పి చెప్పుకోవాలా.. అని కూడా అనుకోక తప్పదు. అవును ఆవు పాల కన్నా గాడిద పాలే ఎక్కువ ప్రియమమవుతున్నాయి. కోపం వస్తే గాడిద అని తిట్టడం, ఎక్కువ పని చేయిస్తే.. గాడిద చాకిరీ అనుకోవడం.. తెలుగు వాళ్లకు సర్వ సాధారణం. కానీ ఇప్పుడు అలా అనుకోవడానికి కూడా గాడిదలు ఛాన్సు ఇవ్వడం లేదు. ఆవుల్ని, గేదెల్ని పెంచినట్టు తెలుగు నాట గాడిదల్ని కూడా పెంచుతుంటారు కానీ కేవలం దానితో బరువులు మోయించుకోవడానికి. అది కూడా ఇప్పుడు కాదు యంత్ర సాయం పెద్దగా అలవాటు కాని సమయంలో గాడిదల్ని కొన్ని జాతుల వాళ్లు పెంచే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగర జనాలకు చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెల్లో అలాగే హైదరాబాద్ సహా మరి కొన్ని  ప్రాంతాల్లో ఉదయాన్నే గాడిద పాలు అమ్మడం మామూలు విషయమే. ముఖ్యంగా ఆ పాలలో ఔషధ గుణాలుంటాయని, చిన్నపిల్లలకు పడితే మంచిదన్నది కొంత మంది నమ్మకం. అందుకే వాటికి అంతో ఇంతో డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. Donkey’s farm in AP సరే ఈ విషయం చాలా మందికి కొత్త కావచ్చు. కానీ.. ఇకపై మాత్రం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి