
మనం ఇంట్లోకి రాగానే ఓ సువాసన ఉండాలని కోరుకుంటూ ఉంటాం. సువాసన అనేది మన మనస్సును సంతృప్తి పరిచి మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. అయితే సాధారణంగా మన ఇంట్లోని వంట గదిలో మాత్రం ఈ సువాసన కొద్దిసేపటికి చెడువాసనగా మారుతుంది. ముఖ్యంగా వంటగదిలో ఫంకీ వాసనగా మారుతుంది. ఎన్నిసార్లు శుభ్రం చేసినా రోజుల తరబడి వంటగది నుంచి దుర్వాసన వేధిస్తూ ఉంటుంది. కాబట్టి వంటగది నుంచి జిడ్డు వాసనను వదిలించుకోవడానికి, గాలిని వేగంగా ఫ్రెష్ చేయడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం.
కెఫీన్ షాట్ మీకు రిఫ్రెష్‌గా ఉండడమే కాకుండా అవాంఛిత వాసనను నివారించవచ్చు. కాఫీలో నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి కాఫీ పొడి వేసి నీటిని మరిగిస్తే ఆ వాసన జిడ్డు వాసనను తటస్థీకరిస్తుంది.
మీ వంటగదిలో పాడవేసే నిమ్మ తొక్కలను ఉడకబెట్టడం ద్వారా దుర్వాసనను అరికట్టవచ్చు. నీటిలో కొన్ని లవంగాలు, దాల్చినచెక్కతో పాటు నిమ్మతొక్కలను వేసి ఉడకబెడితే దుర్వాసన పోతుంది. ఈ మిశ్రమం నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది.
వంటగదిలో వంట చేస్తున్న సమయంలో ఎల్లప్పుడూ కిటికీలను తెరచి ఉంచాలి. మూసి ఉన్న తలుపులతో దుర్వాసన సమస్య మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి, క్రాస్ వెంటిలేషన్ కోసం వంట చేస్తున్న సమయంలో కిటికీలను తెరిచి ఉంచాలి. ఇది భోజనం సిద్ధం చేసేటప్పుడు వాసనను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.
మొండి వాసనల నుంచి రక్షణ కోసం నీటిలో బేకింగ్ సోడాను జోడించడం ద్వారా మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. ఈ గిన్నెను రాత్రిపూట మీ వంటగది కౌంటర్‌టాప్‌లో ఉంచాలి. అది గాలి నుంచి వాసనను గ్రహిస్తుంది. ప్రత్యామ్నాయంగా మీరు బదులుగా వెనిగర్ ఉపయోగించవచ్చు.
వంట చేసిన తర్వాత ప్రతిసారీ కౌంటర్‌టాప్, స్టవ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు తరచుగా సింక్, చెత్తబుట్లను విస్మరిస్తాం. ఈ రెండు అంశాలు వంటగదిలో దుర్వాసన కారణం అవుతాయి. కాబట్టి చెత్తాచెదారాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. అలాగే వాసన రాకుండా కొన్ని నిమ్మ తొక్కలను ఉంచాలి. అలాగే సింక్‌ను సరిగ్గా శుభ్రం చేసి కడగాలి. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి సింక్ పైపు ద్వారా సహజ గాలి శుద్ధిగా ఉపయోగించే నిమ్మకాయ నీటిని పంపండం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..