ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. ఇదిలా ఉంటే గుండెపోటు వచ్చే సమయంలో చాలా మంది బాత్‌రూమ్‌లలో ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంతకీ బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో గుండె పోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది.? దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) నివేదిక కూడా 11 శాతం కంటే ఎక్కువ గుండెపోటు కేసులు బాత్రూమ్‌లో సంభవిస్తున్నాయని పేర్కొంది. దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి కేసుల్లో చాలా వరకు ప్రేగు కదలిక లేదా మూత్రవిసర్జన సమయంలో సంభవిస్తాయి.
బలబద్ధకంతో ఇబ్బంది పడే వారు విసర్జన సమయంలో ఎక్కువ శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అసమతుల్యత కారణంగా, మెదడుకు రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుంది, దీంతో ఇది అపస్మారక స్థితికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాత్‌రూమ్‌లో ఏదైనా జరిగితే బయటి వ్యక్తులకు తెలియడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ మరణాలు సంభవించడానికి ఇదే కారణంగా చెబుతున్నారు.
ఇక స్నానం చేసే సమయంలో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బాగా చల్లటి నీరు లేదా వేడి నీరుతో స్నానం చేయడం వల్ల హృదయ స్పందన రేటు ప్రభావితమవుతుంది. బాగా చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరంలోని రక్తమంతా మెదడుకు చేరుతుంది. ఇది రక్త నాళాలు, ధమనులలో ఉద్రిక్తతను పెంచుతుంది. దీంతో హృద్రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే మరీ వేడి నీరు కాకుండా మరీ చల్లటి నీరు కాకుండా స్నానం చేయాలి. అలాగే తలపై ఒకేసారి నీరు పోయకుండా క్రమంగా పోస్తుండాలి. గతంలో గుండెపోటు వచ్చిన వారు, బీపీ పేషెంట్స్, వృద్ధులు బాత్‌రూమ్ ఉపయోగించే సమయంలో డోర్ మూయకుండా ఉండడమే ఉత్తమం అని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..