Alcohol: 30 రోజులు మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా.? శరీరంలో జరిగే మార్పులివే

|

Sep 12, 2024 | 7:36 PM

ఆల్కహాల్‌ను మానేసిన రెండు వారాల్లోనే మార్పు మొదలవుతుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. నిజానికి ఆల్కహాల్‌తో మొదట్లో మత్తు భావన కలిగినా.. రాత్రుళ్లు మాత్రం సరైన నిద్ర ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మద్యం మానేసిన వెంటనే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపిస్తుంది...

Alcohol: 30 రోజులు మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా.? శరీరంలో జరిగే మార్పులివే
Alcohol
Follow us on

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హానికరమని తెలిసినా ముందు బాబులు మాత్రం మద్యాన్ని మానుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఆల్కహాల్ అలవాటును మానుకోవాలని సూచిస్తుంటారు. మద్యానికి బానిసలుగా మారిన వారికి డీ ఆడిక్షన్‌ ద్వారా అలవాటును మాన్పిస్తుంటారు. అయితే ఆల్కహాల్‌ అలవాటు ఉన్న వారు పూర్తిగా మానేస్తే శరీరంలో ఊహకందని మార్పులు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆల్కహాల్‌ మానేస్తే 30 రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ను మానేసిన రెండు వారాల్లోనే మార్పు మొదలవుతుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. నిజానికి ఆల్కహాల్‌తో మొదట్లో మత్తు భావన కలిగినా.. రాత్రుళ్లు మాత్రం సరైన నిద్ర ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మద్యం మానేసిన వెంటనే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి భావన కలుగుతుంది. ఇక ఆల్కహాల్‌ మానేసిన కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆల్కహాల్‌ తీసుకున్న సమయంలో మనకు తెలియకుండానే ఎక్కువగా తింటుంటాం.

అయితే ఆల్కహాల్‌ మానేస్తే బరువు నెల రోజుల్లోనే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కాలేయం పనితీరు కూడా మెరుగడం ప్రారంభమవుతుంది. ఆల్కహాల్‌ మానేయ్యడం వల్ల జీర్ణవ్యవస్థ, జీవక్రియ సవ్యంగా సాగుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్‌ మానేస్తే మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆల్కహాల్‌ మానేసిన వెంటనే ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమవుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. వీటన్నింటితో పాటు ఆల్కహాల్ మానేయడం ద్వారా సమజంలో కూడా గౌరవం పెరుగుతుంది. మనుషుల మధ్య బంధాలు బలోపేతమవుతాయి. ఎలా చూసుకున్నా ఆల్కహాల్‌ మానేయడం అన్ని రకాల మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..