
మనలో చాలా మంది నిద్రలో మాట్లాడుతుంటారు. మాట్లాడినట్లు మనకు తెలియదు. ఉదయం లేవగానే పక్కనున్న వారు చెప్పే వరకు ఆ విషయం తెలియదు. అయితే నిద్రలో మాట్లాడడానికి మనలో చాలా మంది పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఒక ఫన్నీ విషయంగానే భావిస్తుంటార. అయితే అసలు మనిషి నిద్రలో ఎందుకు మాట్లాడుతారు.? దీనికి ఏమైన చికిత్స ఉందా.? లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
నిద్రలో మాట్లాడడాన్ని స్లీప్ టాకింగ్ డిజార్డర్ అంటారు. ఓ అధ్యయనం ప్రకారం దాదాపు 66 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రతీరోజూ నిద్రలో మాట్లాడరని కేవలం కొన్ని సందర్భాల్లోనే నిద్రలో మాట్లాడుతారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో ఎందుకు మాట్లాడుతారన్న దానికి ప్రత్యేకంగా ఇదే కారణం ఉందన్న దానిపై ఎలాంటి సాక్ష్యాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఉదయం మనం గడిపిన సమయం, కలిసిన వ్యక్తులు, ఎదురైన అనుభవాలే నిద్రలో మాట్లాడానికి కారణంగా చెబుతున్నారు.
అయితే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుండొచ్చని అంచనా వేస్తున్నారు. పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో స్లీప్ టాకింగ్‌కి సంబంధం ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. పీడ కలలు వచ్చే వారు కూడా రాత్రుళ్లు నిద్రలో మాట్లాడుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్న వారు కూడా నిద్రలో మాట్లాడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే నిద్రలో మాట్లాడడం పెద్దగా హాని కలిగించే అంశం కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అయితే పక్కన పడుకున్న వారికి మాత్రం ఇది ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. ఇక స్లీప్ టాకింగ్‌ను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అర్థరాత్రి వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు వాడకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా హారర్ చిత్రాలు చూడకూడదంటున్నారు. అలాగే ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా వంటివి చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..