Lifestyle: కాసేపు మీతో మీరు కూడా మాట్లాడుకోండి.. ఎందుకో తెలుసా.?

అద్దంలో చూసుకుంటూ మీతో మీరు మాట్లాడుకోవడాన్ని మిర్రర్‌ టాకింగ్‌ అంటారు. ఇది కాస్త వింతగా అనిపించినా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజుల్లోనే దాని ప్రయోజనాలను చూడటం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇంతకీ మిర్రర్‌ టాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

Lifestyle: కాసేపు మీతో మీరు కూడా మాట్లాడుకోండి.. ఎందుకో తెలుసా.?
Mirror Talking

Updated on: Mar 22, 2024 | 4:53 PM

జీవితంలో సక్సెస్‌ కావాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మనలో కొందరు ఆత్మవిశ్వాసం లోపంతో బాధపడుతుంటారు. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి రకరకాల టెక్నిక్స్ పాటించమని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వాటిలో మిర్రర్‌ టాకింగ్ ఒకటి. అంటే ప్రతీరోజూ కొంచెం సేపు మీతో మీరు పర్సనల్‌గా మాట్లాడుకోవాలని దాని అర్థం. ఇంతకీ ఏంటీ మిర్రర్‌ టాకింగ్, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్దంలో చూసుకుంటూ మీతో మీరు మాట్లాడుకోవడాన్ని మిర్రర్‌ టాకింగ్‌ అంటారు. ఇది కాస్త వింతగా అనిపించినా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజుల్లోనే దాని ప్రయోజనాలను చూడటం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇంతకీ మిర్రర్‌ టాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

* అద్దంలో మీతో మాట్లాడుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు. దీని ద్వారా ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో అర్థమవుతోంది. మీ టాకింగ్ స్టైల్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో కూడా తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ 15 నుంచి 20 నిమిషాలు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

* తమపై తమకు నమ్మకంలేని వారు సామాజికంగా కూడా ఒంటరిగా ఉంటారు. కొత్త వారితో ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. మిర్రర్ టాక్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మిర్రర్ టాక్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, మీరు ఎలా మాట్లాడాలి, ఏ పదాలు ఉపయోగించాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే విషయాలపై మంచి అవగాహన పొందుతారు.

* మిర్రర్‌ టాకింగ్ వల్ల మీలోని లోపాలను మీరు గుర్తించే అవకాశం లభిస్తుంది. మీరు మాట్లాడుతున్న విధానం మీకు అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మార్పులు చేసుకోవడం వల్ల ఆత్మగౌరవం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే మీపై మీకు నమ్మకం పెరగడమే కాకుండా, మిమ్మల్ని మీరు ఇష్ట పడడం ప్రారంభిస్తారు. కాబట్టి మిర్రట్‌ టాకింగ్‌ను ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..