
ప్రస్తుత కాలంలో యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. గతంలో వృద్ధాప్యానికి సంకేతంగా భావించే ఈ సమస్య ఇప్పుడు యువతలోనూ వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలుగా పోషకాహార లోపం, చెడు జీవనశైలి, ఒత్తిడి, జంక్ ఫుడ్‌ను నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12 లోపం తెల్ల జుట్టు సమస్యకు ప్రధాన కారణంగా చెప్తారు. అయితే సరైన ఆహారం, కొన్ని ఇంటి నివారణలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా కీలకం. విటమిన్ డి లోపం వల్ల జుట్టు బలహీనపడి, త్వరగా తెల్లగా మారుతుంది.
సూర్యరశ్మి: విటమిన్ డికి అతిపెద్ద వనరు సూర్యరశ్మి. రోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.
ఆహార పదార్థాలు: పాలు, పాల ఉత్పత్తులు, పుట్టగొడుగులు, గుడ్లు, కొవ్వు చేపల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.
విటమిన్ బి12 జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు రాలడం, త్వరగా నెరవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పాల ఉత్పత్తులు: గుడ్లు, పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది.
మాంసాహారాలు: మాంసం, చేపలు వంటివి విటమిన్ బి12కు మంచి వనరులు. మాంసాహారం తినేవారికి ఇది ఉత్తమ ఎంపిక.
పోషకాహారంతో పాటు కొన్ని సహజ నివారణలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి.
కొబ్బరి నూనె – నిమ్మకాయ: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు క్రమంగా నల్లగా అవుతుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఈ నివారణలు, ఆహారంలో సరైన పోషకాలను చేర్చుకోవడం ద్వారా అకాల తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..