Benefits of Fasting : ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..? మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట..?

Benefits of Fasting : దేశంలో చాలామంది ఉపవాసం పాటిస్తారు. సాధారణంగా మతపరమైన ఆరాధన వల్ల ఉపవాసం ఉంటారు.

Benefits of Fasting : ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..? మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట..?
Fasting

Updated on: May 21, 2021 | 7:25 PM

Benefits of Fasting : దేశంలో చాలామంది ఉపవాసం పాటిస్తారు. సాధారణంగా మతపరమైన ఆరాధన వల్ల ఉపవాసం ఉంటారు. భారతదేశంలో ఉపవాసం వెనుక ప్రధాన కారణం ఆరాధన, తీజ్-పండుగ లేదా ఏదైనా ప్రతిజ్ఞకు సంబంధించినదై ఉంటుంది. కానీ ఉపవాసం ఉండటం వల్ల ఎటువంటి సమస్య లేదు. అంతేకాకుండా దీని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఉపవాసం ఉన్నవారికి వృద్ధాప్యంలో పెద్దగా సమస్యలు ఉండవని ఒక అధ్యయనం ప్రకారం తేలింది. అంతేకాదు ఉపవాసం ఉండటం జీర్ణవ్యవస్థకు చాలా మంచిదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సాసోన్ కోర్సీ మాట్లాడుతూ.. ఉపవాసం లేదా ఆహారాన్ని తినకపోవడం వల్ల మన శరీరం ప్రతిస్పందనలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఎలుకలపై చేసిన ఓ అధ్యయనంలో ఇదే జరిగింది. అందులో 24 గంటలు వాటికి ఆహారం ఇవ్వకపోతే ఆక్సిజన్, శక్తి వినియోగించబడుతుందని తేలింది.

ప్రొఫెసర్ సాసోన్ కోర్సీ ప్రకారం.. మనం క్రమం తప్పకుండా ఉపవాసం చేస్తే, మన శరీర కణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందన్నారు. ఆహారం తినకపోవడం వల్ల స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఉపవాసం కారణంగా మన శరీరంలో ఒక ప్రత్యేక ప్రోటీన్ తయారవుతుంది. ఇది మెదడు కణాలకు రక్షణ కల్పిస్తుంది. దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. ఉపవాసం ఉంచడం వల్ల మన జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల ఇది బాగా పనిచేయగలదు. ఇది కాకుండా మన కడుపు కూడా చాలా రిలాక్స్ గా ఉంటుంది.

Dogs Sniffing Corona : కరోనా సోకిన వారిని పసిగడుతున్న శునకాలు..! సెకన్ల వ్యవధిలో ఫలితాలు తేల్చేస్తున్నాయి.. ఎక్కడో తెలుసా..?

Tighten Lockdown: త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్లపైకి వస్తే కఠినచర్యలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ

మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈసారి పవన్ కోసం భారీ స్కెచ్.. సరికొత్త పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ ?