Vicks Uses: విక్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!

|

Jul 08, 2024 | 5:00 PM

వర్షా కాలం మొదలైంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించినవి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది జలుబు సమస్యను తగ్గించుకోవడం విక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. విక్స్ ఉపయోగించడం వల్ల తలనొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస కోశ సమస్యల నివారిణిగా పని చేస్తుంది. విక్స్ కేవలం ఈ సమస్యలకే పనిచేస్తుంది అనుకంటే మాత్రం పొరపాటే. విక్స్‌తో చాలా రకాల సమస్యలకు..

Vicks Uses: విక్స్ కేవలం జలుబుకు మాత్రమే కాదు.. ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి!
Vicks Uses
Follow us on

వర్షా కాలం మొదలైంది. ఇప్పుడు ప్రతీ ఒక్కరి ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరానికి సంబంధించినవి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది జలుబు సమస్యను తగ్గించుకోవడం విక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. విక్స్ ఉపయోగించడం వల్ల తలనొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస కోశ సమస్యల నివారిణిగా పని చేస్తుంది. విక్స్ కేవలం ఈ సమస్యలకే పనిచేస్తుంది అనుకంటే మాత్రం పొరపాటే. విక్స్‌తో చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. విక్స్‌ను ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మరి విక్స్‌తో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఏయే సమస్యలకు ఉపయోగించు కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సైనస్ తగ్గుతుంది:

చాలా మంది సైనస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు విక్స్‌ను కొద్దిగా ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన పీల్చితే సైనస్ తల నొప్పి తగ్గుతుంది.

దోమలు కుట్టవు:

విక్స్‌తో దోమలు కుట్టకుండా కూడా చేయవచ్చు. విక్స్‌లో కొద్దిగా వేజలిన్ కలిపి.. చర్మం, బట్టలపై రాసుకుంటే దోమలు కుట్టవు. పిల్లలకు కూడా రాయవచ్చు. సాయంత్రం పూట రాస్తే బెటర్. చెవుల వెనుక, మోచేతులపై, మెడ, మోకాళ్లపై రాసుకుంటే కీటకాలు, ఈగలు వాలవు.

ఇవి కూడా చదవండి

మొటిమలు తగ్గుతాయి:

మొటిమల సమస్యలతో ఉండే వారు ప్రతి రోజూ విక్స్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజులో కనీసం 3 సార్లు అయినా విక్స్‌ను పింపుల్స్‌పై రాయండి. ఇలా తరచూ చేస్తే.. మొటిమల సమస్య తగ్గుతుంది.

కండరాల నొప్పులు:

కండరాల నొప్పులతో బాధ పడేవారు విక్స్ ను ఉపయోగించవచ్చు. నొప్పులు ఉన్న చోట విక్స్‌తో మర్దనా చేయాలి. ఆ తర్వాత ఒక క్లాత్‌ తీసుకుని వేడి నీటిలో ముంచి.. కాపురం పెడితే నొప్పులు త్వరగా తగ్గుతాయి.

స్ట్రెచ్ మార్క్స్ పోతాయి:

చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఇవి అంత త్వరగా పోవు. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడిన ప్రదేశంలో చర్మం సాగిపోయినట్టుగా ఉంటుంది. స్ట్రెచ్ మార్స్స్ ఉన్న ప్రదేశంలో రెండు వారాల పాటు విక్స్ రాస్తే.. స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..