Holi 2021: హోలీ సంబరాల్లో భాంగ్ ఎందుకు తాగుతారో తెలుసా.. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే..

|

Mar 26, 2021 | 8:46 PM

Holi 2021: హోలీ అంటేనే రంగుల పండుగ. పాల్గుణ పౌర్ణమి రోజు రాత్రి హోలిక దహనంతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయి. చైత్ర, ఫాల్గుణ, కృష్ణ పక్షంలో

Holi 2021: హోలీ సంబరాల్లో భాంగ్ ఎందుకు తాగుతారో తెలుసా.. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే..
Bhang
Follow us on

Holi 2021: హోలీ అంటేనే రంగుల పండుగ. పాల్గుణ పౌర్ణమి రోజు రాత్రి హోలిక దహనంతో ఈ సంబరాలు ప్రారంభమవుతాయి. చైత్ర, ఫాల్గుణ, కృష్ణ పక్షంలో భాయ్ దూజ్‏తో ఇది ముగుస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లోని బర్సానా, నందగావ్ వంటి అనేక ప్రదేశాలలో వేడుకలు దాదాపు వారం ముందు నుంచే ప్రారంభమవుతాయి. సమావేశాలు, విందులు ఈ వేడుకలలో ముఖ్యమైన అంశాలు. హోలీ వేడుకలలో ఎక్కువగా భాంగ్ తాగుతుంటారు. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అంత ఫేమస్ కాదు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం హోలీ సంబరాల్లో కచ్చితంగా భాంగ్ ఉండాల్సిందే. అయితే ఈ భాంగ్ తీసుకునే సంప్రదాయం అసలు ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకుందాం.

భాంగ్ అంటే శివుడి పానీయం అని నమ్ముతుంటారు. ఇందుకు ఓ పురాణ కథను చెప్పుకుంటారు. శివుడు వైరాగ్య జీవితం నుంచి గృహస్త జీవితంలోకి రావడంతో ఈ హోలీ వేడుకలలో భాంగ్ వినియోగిస్తారట. ధ్యానంలో ఉన్న శివుడిని మేల్కోల్పేందుకు పార్వతి దేవి ప్రయత్నిస్తుండగా.. ఆమెకు సహయంగా కామదేవుడు వస్తాడు. అతడు శివుడి ధ్యానంను ఎలాగైనా విచ్ఛినం చేయాలని తన మధన బాణాన్ని పరమేశ్వరుడిపై విసురుతాడు. దీంతో శివుడు అగ్రహించి.. కాముడిని దహనం చేస్తాడు. అనంతరం శివుడు పార్వతి కోరిక మేరకు గృహస్త జీవితంలోకి ప్రవేశించాడని.. ఆ ఆనంద క్షణాలలోనే ప్రజలు భాంగ్ సేవిస్తారని ప్రతీతి.

ఇక ఇదే కాకుండా.. మరో కథ కూడా చెప్పుకుంటారు. భక్త ప్రహ్లదుడిని చంపడానికి ప్రయత్నించిన హిరణ్యకశిపుడిని.. నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు అతి క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత నరసింహుడిని శాంతింప చేయడానికి శివుడు పక్షి రూపంలో జన్మించాడని చెబుతుంటారు. ఇక అమృతాన్ని శోధించేటప్పుడు అందులోని ఒక చుక్క మందారా పర్వతంపై పడిందని చెబుతుంటారు. దాని నుంచి మరో మొక్క జన్మించిందని చెబుతుంటారు. అదే ఔషద గుణాలున్న భాంగ్ మొక్క అని అంటుంటారు. అయితే ఈ భాంగ్ అనేది మనిషి ఒత్తిడిని తగ్గిస్తుందని..అధర్వవేదంలో ఉందని చెబుతుంటారు. అలాగే ఈ భాంగ్‏ను పాలు, పిస్తా, చక్కెరతో తయారు చేస్తారు.

Also Read:

Holi 2021: హోలీ సంబరాలు.. అబ్బాయిల కోసం కొన్ని డ్రెస్సింగ్ ఐడియాస్.. మీరు తెలుసుకోండి..

Holi 2021: హోలీ రంగుల నుంచి మీ గోళ్ళను ఈ విధంగా కాపాడుకోండి.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ నెయిల్స్ భద్రమే..