AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపైన ముడతలా..? చిన్న వయసులోనే ముసలితనమా..! అయితే వీటిని మీరు తినడం లేదని అర్థం.. చెక్ చేసుకోండి..

Benefits of Almonds : ఆధునిక జీవితంలో నిత్యం మనం తీసుకునే కల్తీ ఆహార పదార్థాలు, పొల్యూషన్, నిద్ర సమయాలు మారడం, తదితర విషయాల

ముఖంపైన ముడతలా..?  చిన్న వయసులోనే ముసలితనమా..! అయితే వీటిని మీరు తినడం లేదని అర్థం.. చెక్ చేసుకోండి..
Benefits Of Almonds
uppula Raju
|

Updated on: Mar 27, 2021 | 7:40 AM

Share

Benefits of Almonds : ఆధునిక జీవితంలో నిత్యం మనం తీసుకునే కల్తీ ఆహార పదార్థాలు, పొల్యూషన్, నిద్ర సమయాలు మారడం, తదితర విషయాల వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో అందంపై శ్రద్ధ పెట్టే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. తక్కువ వయసులోనే ఎక్కువ వయసువారిలా కనిపిస్తున్నారు. వ‌ృద్ధాప్య చాయలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారు తమ డైట్‌లో బాదం పప్పును చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే… పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ పాటించినా ఒక్కోసారి సైడ్ ఎపెక్ట్‌ భారిన పడే అవకాశం ఉంది. అందుకే బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం దివ్య ఔషధంగా పనిచేస్తుందని తేలింది.

బాదం పప్పులో అధికంగా ఉండే ఆల్ఫా టోకోఫెరాల్‌ కారణంగానే మహిళల్లో ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ), అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి అందుకోసమే డైట్‌లో బాదంను చేర్చుకోవాలి.

‘ప్రతిరోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులొస్తున్నాయని భారతీయ సౌందర్య నిపుణుల అధ్వర్యంలో తేలింది. బాదం పప్పుల్లో విటమిన్‌-ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే బాదంపప్పు తిని నిత్యం యవ్వనంగా ఉండండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Assam Election 2021 Phase 1 Voting LIVE: మొదలైన అస్సాం తొలి దశ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు జనాలు..

GIC Recruitment 2021: డిగ్రీ పాస్ అయిన వారికి శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే..!

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం