Beauty Tips: ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి.. చర్మం నిగారింపు మీ సోంతం..!

|

Feb 22, 2024 | 7:50 PM

ఈ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ముఖంపై నల్ల మచ్చలు, ముడతల సమస్యను తగ్గించుకోవడానికి మీరు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా, వేపతో మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, దానికి దూరంగా ఉండటం ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Beauty Tips: ముఖంపై ముడతలు, మచ్చలు పోవాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి.. చర్మం నిగారింపు మీ సోంతం..!
Neem Face Pack
Follow us on

మీ అందమైన ముఖంపై నల్ల మచ్చలు, ముడతలు ఇబ్బంది పెడుతున్నాయా..? ముఖంపై ముడతలు, నల్లమచ్చలను దాచుకోవడానికి క్లెన్సర్, ఫౌండేషన్ ఎక్కువగా వాడాల్సిన పరిస్థితిలో ఉన్నారా…? ఇకపై టెన్షన్‌ పడకండి. ఇక్కడ చెప్పబోయే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి… ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది. చాలా మందిలో ఎండా, మొటిమలు, హార్మోన్ల మార్పులు, వివిధ కారణాల వల్ల ముఖంపై నల్లమచ్చలు, ముడతలు ఏర్పడుతుంటాయి. ప్రస్తుత ఆహారం, జీవనశైలి కూడా దీనికి కారణం కావచ్చు. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి ఈ అద్భుత ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగకరమైన ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.

మీరు ముడతలు లేని, స్పష్టమైన, మచ్చలు లేని చర్మం కావాలని కోరుకుంటున్నారా..? అయితే.. వేప ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్ మీకు అనువైనది. అలాగే ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్లతో పాటు అనేక సమస్యలు కూడా తగ్గుతాయి. వేప ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వేప ఫేస్ ప్యాక్ కావలసినవి..

ఇవి కూడా చదవండి

– వేప ఆకులు – ½ కప్పు

– నీరు – 1 నుండి 2 tsp లేదా అవసరమైనంత

– పసుపు పొడి – ½ tsp

* వేప ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి

– వేప, నీళ్లతో రుబ్బుకోవాలి.

– ఈ సిద్ధం చేసిన పేస్ట్‌లో కొంత పసుపు పొడిని మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి.

– ఇది దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు ఆరనివ్వండి.

– తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

చర్మ సమస్యలు దూరమవుతాయి..

ఈ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ముఖంపై నల్ల మచ్చలు, ముడతల సమస్యను తగ్గించుకోవడానికి మీరు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా, వేపతో మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, దానికి దూరంగా ఉండటం ఉత్తమమని గుర్తుంచుకోండి. ఈ పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..