Escaping from Dogs: కుక్కలు మీ వెంట పడకూడదంటే ఇలా చేయండి..

ఈ మధ్య వీధి కుక్కల గురించి టీవీలు, పేపర్‌లలో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు, పెద్దల వెంట పడి మరీ వీధి కుక్కలు ప్రాణాలను దారుణంగా తీసేస్తున్నాయి. కుక్కల దాడిలో చాలా మంది ప్రాణాలను వదిలారు. పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ కుక్కలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా కనిపిస్తే అస్సలు వదిలి పెట్టడం లేదు. వెంట పడి మరీ దారుణంగా దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో చాలా మంది..

Escaping from Dogs: కుక్కలు మీ వెంట పడకూడదంటే ఇలా చేయండి..
Escaping From Dogs
Follow us

|

Updated on: Jul 21, 2024 | 7:39 PM

ఈ మధ్య వీధి కుక్కల గురించి టీవీలు, పేపర్‌లలో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు, పెద్దల వెంట పడి మరీ వీధి కుక్కలు ప్రాణాలను దారుణంగా తీసేస్తున్నాయి. కుక్కల దాడిలో చాలా మంది ప్రాణాలను వదిలారు. పల్లెల్లు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ కుక్కలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా కనిపిస్తే అస్సలు వదిలి పెట్టడం లేదు. వెంట పడి మరీ దారుణంగా దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో చాలా మంది గాయ పడుతున్నారు. ఇలాంటి కుక్కల్ని చూస్తుంటే భయం కూడా వేస్తూ ఉంటుంది. అందుకే కుక్కలు మనపై దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటి దగ్గర నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలు వెంట పడితే ఇలా చేయండి:

కుక్కలు మీ వెంట పడినప్పుడు లేదా పరిగెత్తినా, మొరగడం స్టార్ట్ చేసినా అస్సలు ఏ మాత్రం భయ పడకండి. వాటి ముందు ప్రశాంతంగా, స్థిరంగా నిలబడండి. మీరు పరిగెత్తడం స్టార్ట్ చేస్తే అవి మీపై ఖచ్చితంగా దాడి చేస్తాయి. కాబట్టి కుక్కలు మీ వెంట పడితే మాత్రం ధైర్యంగా, నిదానంగా ఉండండి. అప్పుడు అవే పక్కకు వెళ్లిపోతాయి.

గట్టిగా అరవాలి:

కుక్కలు మిమ్మల్ని చూసినా, మీ వెంట పడినా గట్టిగా అరవాలి. నో లేదా స్టాప్ అని అనండి. చాలా కుక్కలు ఈ పదాలకు స్పందించి ఆగిపోతాయి. మీ మాట్లాడటం విని అక్కడి నుంచి వెళ్లి పోతాయి. కానీ పరిగెత్తకూడదు.

ఇవి కూడా చదవండి

వీటితో రక్షించుకోండి:

ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒంటరిగా వెళ్తున్నారు అంటే.. మీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉండేలా చూసుకోండి. అవి మీ వెంట పడితే.. వాటిని అదిలిస్తూ.. హ్యాండ్ బ్యాగ్, గొడుగు, కర్ర లాంటి వస్తువుల్ని చూపించి బెదిరించండి.

కూల్ చేయండి:

ముందుగా కుక్కలు మిమ్మల్ని చూసి మొరుగుతున్నాయి అంటే.. వాటిని ముందు కూల్ చేయాలి. గట్టిగా మాట్లాడుతూనే.. వాటితో మాట్లాడుతూ ఉండండి. మీ కూలింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉపయోగించండి. వాటికి కుక్క రెస్పాండ్ కాకపోతే.. బెదిరించడం స్టార్ట్ చేయాలి. వెంటనే పరిగెత్తకుండా నెమ్మదిగా నడవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..