21 July  2024

బిర్యానీ ఆకు నీరు తాగితే... 

Narender.Vaitla

మధుమేహంతో బాధపడేవారికి బిర్యానీ ఆకు టీ ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని పాలీఫెనాల్స్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరం చేయడంలో కూడా బిర్యానీ ఆకులతో చేసిన టీ ఉపయోగపడుతుంది. గురకచ ఛాతి నొప్పి వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధికి చెక్‌ పెట్టడంలో బిర్యానీ ఆకు టీ ఉపయోగపడుతుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, కొలొరెక్టల్ క్యాన్సర్‌ వంటి సమస్యలను దరి చేరనివ్వదు

చుండ్రు,  జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. బిర్యానీ నీటితో జుట్టు మూలాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా స్పాల్ప్‌లో ఇన్ఫెక్షన్‌ రాకుండా చూస్తుంది.

మెరుగైన జీర్ణక్రియకు కూడా బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, జీర్ణక్రియ లక్షణాలను కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకుంటే అజీర్ణ సమస్య దరిచేరదు.

మానసిక సమస్యలను దూరం చేయడంలో కూడా బిర్యానీ ఆకు నీళ్లు సహాయపడతాయి. ఇందులో ఒత్తిడిని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, రోజంతా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బిర్యానీ ఆకు నీటిలో విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.