రూ.373 కోట్లకు అమ్ముడుపోయిన అస్థిపంజరం
TV9 Telugu
21 July 2024
ఇటీవల న్యూయార్క్ దేశంలో నిర్వహించిన వేలంలో డైనోసార్ అస్థిపంజరానికి రికార్డ్ బ్రేకింగ్ బిడ్ వచ్చింది.
డైనోసార్ అస్థిపంజరం 44.6 మిలియన్ డాలర్లు (సుమారు 373 కోట్లు) అమ్ముడైంది. ఇది ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన శిలాజంగా మారింది.
అధికారులు అంచనా వేసిన బిడ్ కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ ధరకి అమ్ముడైంది ఈ పురాతన డైనోసార్ అస్థిపంజరం.
స్టెగోసారస్ అనే డైనోసార్ అస్థిపంజరం సుమారు 11 అడుగుల ఎత్తు, ముక్కు నుండి తోక వరకు 27 అడుగుల పొడవు ఉంటుంది.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ అస్థిపంజరం దాదాపు 15 కోట్ల సంవత్సరాల నాటిదని, ఇది 'లేట్ జురాసిక్ పీరియడ్'కి చెందినదని చెబుతున్నారు.
సోథెబైస్ ప్రకారం, ఈ అస్థిపంజరం ఇప్పటివరకు కనుగొన్న అన్ని అత్యంత పురాతన పూర్తి డైనోసార్ అస్థిపంజరాలలో ఒకటి.
దాని పెద్ద పరిమాణం కారణంగా దీనికి 'అపెక్స్' అని పేరు పెట్టారు. దీనిని హెడ్జ్ ఫండ్ సిటాడెల్ CEO కెన్ గ్రిఫిన్ కొనుగోలు చేశారు.
అంతకుముందు 2020లో స్టాన్ అనే టైరన్నోసారస్ రెక్స్ అస్థిపంజరం సుమారు రూ. 265 కోట్లకు విక్రయించారు అధికారులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి