Apple Peels: యాపిల్ తినడానికి అందరు ఇష్టపడుతారు. అందులో అనుమానం ఏమీలేదు.
యాపిల్‌లో అద్భుత పోషకాలు ఉంటాయి. రోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదని
చెబుతారు నిపుణులు. అయితే చాలామంది యాపిల్‌ను పొట్టు తీసి తినడానికి ఇష్టపడతారు.
అలాంటి సమయంలో తొక్కని చెత్త బుట్టలో వేస్తారు. కానీ వాటిని వివిధ పనులకు
ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అనేది వివరంగా తెలుసుకుందాం.
యాపిల్, దాల్చినచెక్క టీ
ఒక గిన్నెలో కొంచెం నీరు పోసి అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి. తరువాత అందులో
యాపిల్ పీల్స్ వేసి ఉడికించాలి. కాసేపు ఉడికిన తర్వాత వడపోసి అందులో కొంచెం తేనె
కలపాలి. ఈ టీని ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మానికి రెండింటికీ మేలు చేస్తుంది.
సలాడ్‌లో యాపిల్ పీల్స్
ఆహారంలో సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు యాపిల్ తొక్కలను చిన్న, పొడవాటి
ముక్కలుగా కట్ చేసి ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్‌పై ఉంచి ఆపై రుచికరమైన సలాడ్‌ను
ఆస్వాదిస్తే సూపర్‌గా ఉంటుంది.
ఆపిల్ పీల్ జామ్
యాపిల్ తొక్కలను విసిరేయకండి వాటితో జామ్ చేయవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో యాపిల్
పీల్స్, నీటిని పోసి మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టండి. ఆ తర్వాత రుచికి అనుగుణంగా పంచదార
వేసి మరిగించి సుమారు 1/2 కప్పు నిమ్మరసం పిండుకుని బాగా కలపాలి. తర్వాత గాలి
చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. అంతే జామ్ రెడీ అల్పాహారంలో తినండి.
బేకరీ వస్తువుల తయారీకి
మీరు ఇంట్లో బేకరీ ఐటమ్స్ తయారు చేయాలనుకుంటే అందులో యాపిల్ పీల్స్ బాగా
ఉపయోగపడుతాయి. అంతేకాదు బేకరీ ఆహారాలలో ఫైబర్ కూడా ఉన్నట్లవుతుంది. మీరు
అల్యూమినియం పాత్రల నుంచి మరకలను శుభ్రం చేయాలనుకుంటే యాపిల్ పీల్స్
ఉపయోగించవచ్చు. ఇది చేయుటకు యాపిల్ తొక్కలను నీటితో ఉడకబెట్టి తర్వాత
ఉపయోగించుకోండి. యాపిల్ తొక్కలో ఉండే యాసిడ్ అల్యూమినియం వంటసామాను నుంచి
మరకలను తొలగిస్తుంది.