Plastic Tiffin: పొరపాటున కూడా వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేయకండి..! ఎంత ప్రమాదమో తెలుసా..?

|

Apr 01, 2024 | 10:52 AM

కొందరు ప్లాస్టిక్‌ డబ్బాలో ఇంత ఫుడ్‌ పడేసుకుని వెళ్తుంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. జనం హడావుడిగా ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ టిఫిన్లలో వేడివేడి ఆహారాన్ని వేసుకుని వెళ్తుంటారు. అయితే వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ టిఫిన్‌లో ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాలు పడతాయని మీకు తెలుసా.? ఇలా చేయడం వల్ల ఎంత హాని కలుగుతుందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. దీని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

Plastic Tiffin: పొరపాటున కూడా వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేయకండి..! ఎంత ప్రమాదమో తెలుసా..?
Plastic Tiffin
Follow us on

నేటి బిజీ బిజీ లైఫ్‌ స్టైల్‌తో ప్రజలు ఇంటిపనులు, ఆఫీసు పనితో పరుగులు పెడుతున్నారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే వారికి మార్నింగ్ టైం చాలా క్రూషల్‌ అని చెప్పాలి. ఇంటిపని, వంటపని, పిల్లలు అన్నింటితో హడావుడిగా ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆడమగ అనే తేడాలేదు.. భార్యభర్తలిద్దరూ ప్రతి రోజూ రన్నింగ్‌ రేసు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో కొందరు మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు.. కొంతమంది ఏమీ తినకుండానే వెళ్తుంటారు. అంతే కాకుండా మధ్యాహ్నాం కోసం టిఫిన్ కూడా తీసుకోకుండానే హడావుడిగా ఇంటి నుంచి వెళ్లిపోతారు. కొందరు ప్లాస్టిక్‌ డబ్బాలో ఇంత ఫుడ్‌ పడేసుకుని వెళ్తుంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. జనం హడావుడిగా ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ప్లాస్టిక్ టిఫిన్లలో వేడివేడి ఆహారాన్ని వేసుకుని వెళ్తుంటారు. అయితే వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ టిఫిన్‌లో ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రమాదకరమైన ప్రభావాలు పడతాయని మీకు తెలుసా.? ఇలా చేయడం వల్ల ఎంత హాని కలుగుతుందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. దీని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ప్లాస్టిక్ టిఫిన్ లో వేడి వేడి ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు ..

వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేయడం వల్ల చాలా హాని కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్‌లో ఉండే హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసిపోయి శరీరంలోకి ప్రవేశించి అనేక ప్రధాన వ్యాధులకు కారణమవుతాయి. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని రసాయనాలు పిల్లల ఎదుగుదలలో సమస్యలను సృష్టిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ వ్యాధుల ప్రమాదం ఉండవచ్చు..

అంతే కాదు ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీని వల్ల మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా రోజూ చేస్తే థైరాయిడ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని రసాయనాలు చర్మ అలెర్జీల వంటి సమస్యలను కలిగిస్తాయి. కొన్నిసార్లు చాలా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేయడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోయే అవకాశం పెరుగుతుంది. దీని వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందనే భయం నెలకొంది. దీనిని నివారించడానికి, మీరు గాజు లేదా స్టీల్‌ కంటైనర్లను ఉపయోగించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..