Papaya: మీకు బొప్పాయి తినే అలవాటుందా? పొరపాటున వీటితో కలిపి తిన్నారంటే విషంగా మారి..

|

Jul 20, 2022 | 10:11 AM

బొప్పాయిలో ఎన్ని ఔషధ గుణాలున్నప్పటికీ దీనిని కొన్ని పండ్లతో కలిపి తింటే అది శరీరంలో విషంలా మరి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అవేంటంటే..

Papaya: మీకు బొప్పాయి తినే అలవాటుందా? పొరపాటున వీటితో కలిపి తిన్నారంటే విషంగా మారి..
Papaya
Follow us on

Do not eat papaya with these fruits: ఎర్రగా పండిన బొప్పాయిని చూస్తూ తినకుండా ఉండగలమా? బొప్పాయిలో ఆరోగ్యానికి మేలు చేసే విలమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బొప్పాయిని పచ్చిగా ఉన్నా, పండినా ఎలాగైనా తినవచ్చు. బొప్పాయిలోని పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణ సమస్యలను పరిష్కరించడం నుంచి బరువు తగ్గడం వరకు బొప్పాయి కీలకంగా పనిచేస్తుంది. ఈ పండు డయాబెటిక్ రోగులకు వరంలాంటిది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి, బి, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 60 కంటే తక్కువగా ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తుంటాకె. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ అలర్జీగా పనిచేస్తుంది. పేగు పుండ్లను నయం చేయడానికి బొప్పాయిని మించిన వైద్యుడు లేడు. ఇన్ని ఔషధ గుణాలున్నప్పటికీ బొప్పాయిని కొన్ని పండ్లతో కలిపి తింటే అది శరీరంలో విషంలా మరి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అవేంటంటే..

బొప్పాయి, నిమ్మకాయలను కలిపి తినకూడదు. ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సలాడ్ లేదా బొప్పాయి చట్నీ మరేదైనాకావచ్చు నిమ్మకాయతో దీనిని అస్సలు తినకూడదు.

Papaya Fruit

బొప్పాయి వేడి ఆహారం. పెరుగు చలువ ఆహారం అని అందరికీ తెలుసు. ఐతే ఈ రెండింటినీ కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బొప్పాయి తిన్న కనీసం 2 గంటల తర్వాత పెరుగు తినడం బెటర్‌.

ఇవి కూడా చదవండి

ఫ్రూట్ సలాడ్‌లో నారింజ, బొప్పాయిలను కలిపి తినకూడదు. ఈ రెండు పండ్లను కలిపి తింటే జీర్ణం కాదు. అంతేకాకుండా అది శరీరం విషంగామారుతుంది అవుతుంది. అదేవిధంగా కివి – బొప్పాయిలను కూడా కలిపి సలాడ్‌గా తినకూడదు.

టొమాటో – బొప్పాయి ఈ రెండింటి కలయిక కూబి శరీరానికి అంత మంచిది కాదు. వీటిని కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.