AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయినా.. మన శరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? సైన్స్ సీక్రెట్ ఇదే

మరణం తరువాత మానవ శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో మరణం తర్వాత శరీరం ఎండిపోతుంది. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. గుండె చప్పుడు ఆగిపోతుంది. మెదడు కార్యకలాపాలు, ఊపిరితిత్తుల పనితీరు కూడా ఉండదు. కానీ మీకు తెలుసా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని గోళ్లు, వెంట్రుకలు పెరుగుతూనే..

చనిపోయినా.. మన శరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా? సైన్స్ సీక్రెట్ ఇదే
Do Hair And Nails Grow Even After Death
Srilakshmi C
|

Updated on: Apr 28, 2025 | 8:24 PM

Share

సాధారణంగా మరణం తరువాత మానవ శరీరంలోని అన్ని భాగాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో మరణం తర్వాత శరీరం ఎండిపోతుంది. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. గుండె చప్పుడు ఆగిపోతుంది. మెదడు కార్యకలాపాలు, ఊపిరితిత్తుల పనితీరు కూడా ఉండదు. కానీ మీకు తెలుసా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని గోళ్లు, వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. దీని గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.. సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం మరణం తర్వాత శరీరం నీరు కోల్పోవడం వల్ల శరీరం మొత్తం ఎండిపోతుంది. చర్మం దాని మెరుపును కోల్పోతుంది. వేళ్లు కూడా మారుతాయి. అప్పుడు గోర్లు కనిపిస్తాయి.

అదేవిధంగా జుట్టు కొంచెం పొడవుగా కనిపించవచ్చు. అంటే గోర్లు, వెంట్రుకలు వాస్తవానికి పెరగవు. కానీ చర్మం ఎండిపోవడం వల్ల అవి ఎక్కువ పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి. మరణం తక్షణమే సంభవించినప్పటికీ శరీరంలోని ప్రక్రియలు కొంతకాలం కొనసాగుతాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోగానే మెదడు కణాలు వెంటనే చనిపోతాయి. కానీ శరీరంలోని కొన్ని ఇతర కణాలు కొంతకాలం జీవించి శరీరంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించి పనిచేస్తూనే ఉంటాయి. అందువల్ల గోర్లు, వెంట్రుకలు కొంతకాలం పొడవుగా పెరుగుతాయని సైంటిస్టులు అంటున్నారు.

అయితే మరణం తర్వాత జుట్టు మరియు గోర్లు పెరుగుతాయా? అంటే దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. కొన్ని శారీరక ప్రక్రియలు మరణం తరువాత కూడా కొనసాగుతాయి. కనీసం కొంతకాలం అయినా ఈ ప్రక్రియలు ఆగిపోవడానికి సమయం పట్టవచ్చు. మెదడు పనిచేయకపోయినా గోర్లు, వెంట్రుకల పెరుగుదల సాధారణంగానే ఉంటుంది. కొన్ని రోజులకు మరణం తర్వాత గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరగడం ఆగిపోతాయి? అంటే దీనికి సమాధానం ఉంది. నివేదికల ప్రకారం.. గోర్లు,జుట్టు పెరుగుదలకు కొత్త కణాల ఉత్పత్తి అవసరం. దీనికి గ్లూకోజ్ అవసరం. మరణం తర్వాత శరీరంలో గ్లూకోజ్ అందుబాటులో ఉండదు. దీనివల్ల గోర్లు, వెంట్రుకలు పెరగడం ఆగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.