Diwali 2024: దీపావళికి మీ ప్రియమైన వారికి బహుమతి ప్లాన్ చేస్తున్నారా..! తక్కువ ఖర్చుతో ఈ విదేశీ ప్రయాణం బెస్ట్ గిఫ్ట్

|

Oct 20, 2024 | 7:31 PM

దీపావళి పండగ వస్తుందంటే చాలు సందడి మొదలవుతుంది. తమ ప్రియమైనవారి కోసం రకరకాల బహుమతులను ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మీరు కూడా మీకు ఇష్టమైనవారికి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ప్రయాణ బహుమతిగా ఇవ్వడానికి ప్లాన్ చేయండి, ఈ గమ్యస్థానాలు ఖచ్చితంగా దీపావళి ట్రావెల్ గిఫ్ట్ గా నిలుస్తాయి. దీపావళి పండుగ వచ్చిన వెంటనే, బహుమతులను ఎంపిక చేసుకోవడం, ఇవ్వడం ప్రారంభిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో చాలా మంది సంప్రదాయ బహుమతులు కొనుగోలు చేస్తారు. అయితే ఈసారి మీరు మీ ప్రియమైన వారి కోసం ప్రత్యేక ట్రావెల్ ట్రిప్ వంటి ప్రత్యేకమైన బహుమతిని ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం ఒక అద్భుతమైన గమ్యం గురించి తెలుసుకుందాం..

Diwali 2024: దీపావళికి మీ ప్రియమైన వారికి బహుమతి ప్లాన్ చేస్తున్నారా..! తక్కువ ఖర్చుతో ఈ విదేశీ ప్రయాణం బెస్ట్ గిఫ్ట్
Diwali Travel Gift
Follow us on

దీపావళి రాగానే మన సన్నిహితులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి ఈ సారి ఏం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలా అని అందరం ఆలోచిస్తాం. చాలామంది సంప్రదాయ పద్ధతులను అనుసరించి స్వీట్లు లేదా ఇతర బహుమతులు ఇస్తారు. అయితే ఈ దీపావళికి మీరు మీ ప్రియమైన వారిని కొంచెం ఆశ్చర్యపరచాలనుకుంటే… ఇతర బహుమతులను ఇవ్వవచ్చు. కనుక ఈసారి కొత్తదాన్ని ఎందుకు ప్రయత్నించకూడదని మేరు భావిస్తే.. మీ సన్నిహితులకు థ్రిల్, రిలాక్సేషన్, అందమైన జ్ఞాపకాలతో కూడిన యాత్రను ఎందుకు బహుమతిగా ఇచ్చేందుకు ట్రై చేయండి..

ఫెస్టివ్ ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ సంవత్సరం 64% మంది భారతీయులు ఇప్పటికే దీపావళికి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నారని, 41% మంది ప్రజలు లగ్జరీ ట్రిప్‌ల కోసం వెచ్చిస్తున్నారని PickYourTravel సహ వ్యవస్థాపకుడు హరి గణపతి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తమకు నచ్చిన మెచ్చిన వారికి ట్రావెల్ ట్రిప్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా.. సెలవులను విలాసవంతంగా గడిపేలా ప్లాన్ చేస్తున్నారు. లేదా బడ్జెట్‌లో గొప్ప గమ్యస్థానం కోసం వెతుకుతున్నారు. అయితే ఈ దేశాల్లో ప్రయాణం ప్రత్యేకమైన గమ్యస్థానాలు దివాలీకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి.

జపాన్ ప్రయాణం

మీరు కొంచెం విలాసవంతమైన ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే.. జపాన్ ను ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. జపాన్ దేశం ఫుజి పర్వతం, హిరోషిమా చారిత్రక వారసత్వం వంటి పర్యటక ప్రాంతాలు అందమైన యాత్రగా మారి.. మీ ప్రియమైన వారికి ఒక మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఈ దేశంలో పురాతన సంప్రదాయాలు.. ఆధునికత కలగలిపిన సంగమాన్ని చూడవచ్చు. ఇక్కడికి వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి రూ.2 లక్షలు ఖర్చవుతుందని అంచనా.

టర్కీ

మీ ప్రియమైన వారికి టర్కీకి ప్రయాణ టిక్కెట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి విశిష్టమైన కలయిక ఉంది. ఇక్కడికి వెళ్లడం ద్వారా కప్పడోసియాలో హాట్ ఎయిర్ బెలూన్ ఆనందించవచ్చు. టర్కీతూర్పు , పశ్చిమాల అద్భుతమైన కలయిక. ఇక్కడికి వెళ్లాలంటే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు అవుతుందని అంచనా.

ఫిన్లాండ్

ఉత్కంఠభరితమైన ప్రకృతి, శక్తివంతమైన నగరాలు, విశిష్ట సంస్కృతితో అద్భుతమైన అనుభూతిని ఇచ్చే ఫిన్లాండ్‌ కూడా పర్యటనకు బెస్ట్ ఎంపిక. ఇక్కడ లైట్ల వెలుగులు చాలా అందంగా ఉంటాయి. ఈ దేశానిక్కి వెళ్లడం ద్వారా శాంతా క్లాజ్ విలేజ్‌ని సందర్శించవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే రూ.1.5 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.

వియత్నాం

తక్కువ బడ్జెట్‌లో గొప్ప యాత్రను ప్లాన్ చేస్తుంటే వియత్నాం ఎంపిక బెస్ట్ ఎంపిక. హనోయిలోని సందడిగా ఉండే వీధుల నుంచి డా నాంగ్‌లోని ప్రశాంతమైన బీచ్‌ల వరకు, ఈ ప్రదేశం ప్రతి క్షణం అనుభూతి చెందవచ్చు. కొత్త అందాలను వింత అనుభూతులతో కలిగిన జ్ఞాపకాలను అందిస్తుంది. కేవలం రూ.50 వేలకే ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

భూటాన్

హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న భూటాన్‌లో విశ్రాంతమైన సెలవులను ఎంజాయ్ చేయడం అనేది మంచి ఎంపిక. టైగర్ నెస్ట్ మొనాస్టరీని సందర్శించవచ్చు లేదా థింపూలోని ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించావచ్చు. ఇక్కడ ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్వితీయమైన సమ్మేళనం ఎవరికైనా శాంతి, థ్రిల్ రెండింటినీ ఇస్తుంది. ఇక్కడ రూ.50 నుంచి 70 వేల మధ్య ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..