
టీ తయారు చేయడం ఎంత సులభమో, ఆ తర్వాత టీ జల్లెడను శుభ్రం చేయడం అంత కష్టం. రంధ్రాల్లో పేరుకుపోయిన టీ పొడి, పాల జిడ్డు వల్ల టీ సరిగ్గా వడపోత పడదు. కానీ, కొన్ని సింపుల్ క్లీనింగ్ హ్యాక్స్ మీ పనిని సులభతరం చేస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్ టిప్స్‌తో మీ టీ నెట్ ఈజీగా మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం..
టీ జల్లెడను శుభ్రం చేసే ఉపయాలు:
1. బేకింగ్ సోడా, వినెగర్:
ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వినెగర్ కలపండి. జల్లెడను అందులో 15 నిమిషాలు నానబెట్టి బ్రష్‌తో రుద్దితే రంధ్రాలు తెరుచుకుంటాయి.
2. గ్యాస్ మంటపై కాల్చడం (స్టీల్ జల్లెడలకు మాత్రమే):
జల్లెడను గ్యాస్ స్టవ్ మంటపై తక్కువ సెకన్ల పాటు ఉంచండి. లోపల ఉన్న మురికి మాడిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఒకసారి తడితే మురికి రాలిపోతుంది. వెంటనే సోపు నీటితో కడిగేయండి.
3. నిమ్మరసం:
నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు జిడ్డును వదిలిస్తాయి. జల్లెడపై నిమ్మరసం పిండి లేదా నిమ్మరసం కలిపిన వేడి నీటిలో నానబెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4. బ్లీచింగ్ పౌడర్:
మరీ మొండి మరకలు ఉంటే, కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో జల్లెడను ఉంచండి. ఇది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా రంగును కూడా తెల్లగా మారుస్తుంది.
5. పాత టూత్ బ్రష్ వాడకం:
కేవలం సోపు నీటితో కడగడం కంటే, పాత టూత్ బ్రష్‌తో రంధ్రాల లోపల రుద్దడం వల్ల చిన్న చిన్న రేణువులు కూడా బయటకు వచ్చేస్తాయి.
6. డిష్ వాష్ లిక్విడ్, హాట్ వాటర్:
ప్రతిరోజూ టీ చేసిన వెంటనే వేడి నీటిలో డిష్ వాష్ లిక్విడ్ వేసి కడిగితే మురికి పేరుకుపోకుండా ఉంటుంది.
7. ఆల్కహాల్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్:
జిడ్డు మరీ ఎక్కువగా ఉంటే, కాటన్ మీద కొంచెం నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి తుడవడం వల్ల మొండి జిడ్డు వదులుతుంది. తర్వాత కచ్చితంగా వేడి నీటితో కడగాలి.
ప్లాస్టిక్ జల్లెడలను శుభ్రం చేసేటప్పుడు మాత్రం వేడి ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడాలి. లేదంటే, నెట్ కాలిపోయే అవకాశం ఉంటుంది. వంటగదిలో వాడే వస్తువులు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం. ఈ చిట్కాలను వారానికి ఒకసారి పాటించడం వల్ల మీ టీ జల్లెడ ఎప్పుడూ కొత్తదానిలా, పరిశుభ్రంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి