మనం తినే ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అల్పాహారం. ఇది రోజంతా శరీరం ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఎవరైనా ఉదయం అల్పాహారం తీసుకోకపోయినా లేదా హడావిడిగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా అలసట , చికాకు వంటి సమస్యలు సంభవించవచ్చు. మరోవైపు ఉదయం అల్పాహారం ఆరోగ్యంగా ఉంటే రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.
అయితే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు ఉన్నాయి. అయితే వాటిని అల్పాహారంగా తినకూడదు. ఆ ఆహారాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి కనుక వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగి బరువు పెరుగుతారు. అందువల్ల అల్పాహారంగా తినే ఆహారంలో బెల్లం, కొవ్వు , అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని చేర్చుకోవాలి. న్యూట్రిషన్ దీప్శిఖా జైన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దీనిలో ఆమె అల్పాహారం కోసం తినకూడని ఆహారాల గురించి చెప్పింది. ఆ ఆహార పదార్ధాలు ఆరోగ్యకరమైనవే అయినా ఉదయం ఖాళీ కడుపుతో తినడం వలన ఆరోగ్యానికి హాని కరం అని చెబుతున్నారు. వేటిని అల్పాహారంగా తీసుకోవద్దు అంటే ..
పండ్ల రసాలు, స్మూతీలో ఫైబర్ తక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని అల్పాహారంగా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర లెవెల్ పెరుగుతుంది. దీనితో పాటు తక్కువ ఫైబర్ కారణంగా తక్కువ సమయంలో మళ్ళీ ఆకలివేస్తున్న ఫీలింగ్ ఏర్పడుతుంది.
ఉదయం పూట అల్పాహారంతో పాటు టీ లేదా కాఫీ తీసుకోరాదు. వీటిని తాగడం వలన ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగా గ్రహించదు. అల్పాహారంతో పాటు టీ లేదా కాఫీని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాల లోపం ఏర్పడుతుంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
యోగర్ట్ చాలా రుచికరంగా ఉంటుంది. అయితే దీనిలో ఎక్కువగా షుగర్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో దానిని అల్పాహారంలో తీసుకోవడం వలన అధిక కేలరీలు చేరతాయి. అంతేకాదు కొంత సమయం తర్వాత మళ్ళీ ఆకలి వేస్తున్న అనుభూతిని చెందుతారు.
దీనిలో ఆరోగ్యకరమైన అనేక పోషకాలున్నాయి. అయినప్పటికే దీన్ని ఉదయమే ఖాళీ కడుపుతో తినకూడాడు. ఎందుకంటే ఖాళీ కడుపుతో అరటి పండుని తినడం వలన పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. అప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
కనుక ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగించే అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. అందువల్ల అల్పాహారంలో ఎల్లప్పుడూ ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎదుకంటే అల్పాహారంగా అధిక ఫైబర్ ఆహారాన్ని తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..