Destination Wedding: ఈ ప్రదేశాలలో తక్కువ బడ్జెట్‌తో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ కోరిక నెరవేరుతుంది.. ఎలాగో తెలుసుకోండి..!

|

Jun 02, 2022 | 6:15 AM

Destination Wedding: ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలనుకుంటారు. మీకు ఇష్టమైన అందమైన

Destination Wedding: ఈ ప్రదేశాలలో తక్కువ బడ్జెట్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ కోరిక నెరవేరుతుంది.. ఎలాగో తెలుసుకోండి..!
Destination Wedding
Follow us on

Destination Wedding: ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలనుకుంటారు. మీకు ఇష్టమైన అందమైన ప్రదేశంలో జరిగే వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు . కానీ చాలా డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు భారీ బడ్జెట్ అవసరం. దీంతో చాలామంది ఖర్చుకి భయపడి కోరిక నెరవేర్చుకోలేకపోతారు. మీ మనసులో అలాంటి కోరిక ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ బడ్జెట్‌లో కూడా మీ డెస్టినేషన్ వెడ్డింగ్ డ్రీమ్‌ను నెరవేర్చుకోవచ్చు. అలాంటి 5 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. దాదాపు 10లక్షల ఖర్చుతో మీ కోరిక నెరవేరుతుంది.

1. మనాలి

వేసవిలో పెళ్లి చేసుకోవడానికి మనాలి ఉత్తమ ఎంపిక. ఇక్కడ మీరు బియాస్ నది ఒడ్డున ఉన్న లోయల అందమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణం మీ వివాహ వాతావరణాన్ని మరింత మెరుగ్గా మారుస్తుంది. పెళ్లికి వచ్చే అతిథులకు ఈ ప్రదేశం చాలా ఇష్టం. ఇక్కడ మీరు 8 నుంచి 10 లక్షల ఖర్చులో వివాహం చేసుకోవచ్చు. అయితే మీరు ప్రయాణ ఖర్చులను విడిగా భరించాలి.

ఇవి కూడా చదవండి

2. గోవా

మీరు సముద్రాన్ని ఇష్టపడి ఏదో ఒక బీచ్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటే గోవా మీకు ఉత్తమ ఎంపిక. ఇక్కడ అన్ని పార్టీలు కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం బుకింగ్‌లు జరుగుతాయి. మీకు ఇష్టమైన పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ ను ఎంచుకోవాలి. వేసవిలో ఇక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు దాదాపు 100 మందితో హాయిగా పార్టీ చేసుకోవచ్చు. దీని బడ్జెట్ 10 నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది.

3. ఉదయపూర్

ఉదయపూర్ స్నేహపూర్వక వివాహాలకు ప్రసిద్ధ నగరం. ఉదయపూర్‌ను సరస్సుల నగరంగా పిలుస్తారు. ఇక్కడ మీరు సాధారణ బడ్జెట్ వివాహాల నుంచి పెద్ద పెద్ద వివాహాల వరకు చేయవచ్చు. ఉదయపూర్‌లో 10 లేదా 12 లక్షల కంటే తక్కువ ధరకు సరసమైన డెస్టినేషన్ వెడ్డింగ్ ప్యాకేజీలు ఉంటాయి. ఎక్కువగా సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకుంటారు.

4. జైపూర్

రాజస్థాన్‌లో వివాహం చేసుకోవడానికి జైపూర్ మంచి ప్రదేశం. ఇక్కడ మీ వివాహాన్ని రాయల్‌గా చేసుకోవచ్చు. రాతితో చెక్కబడిన గోడలు, స్తంభాలు వివాహ ఫోటోగ్రఫీని అద్భుతంగా మారుస్తాయి. ఇది కాకుండా మీ వివాహాన్ని రాయల్‌గా మార్చగల అనేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. బడ్జెట్ అనేది మీరు మీ వివాహాన్ని ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పెళ్లి బడ్జెట్ 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుంది.

5. సిమ్లా

పర్వతాలను ఇష్టపడే వారికి సిమ్లా సరైన ఎంపిక. వేసవిలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు 150 మంది సమక్షంలో వివాహం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇతర ప్రదేశాల కంటే తక్కువ ధరలకు వివాహ ప్యాకేజీలను పొందవచ్చు. ఇక్కడ 10 నుంచి 15 లక్షల రూపాయలతో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని ట్రావెల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి