
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఖర్జూరం ఒకటి.. ఖర్జూరం (Dates) పోషకాలు అధికంగా ఉండే పండు.. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అల్పాహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ఉదయాన్నే 2-3 ఖర్జూరాలను తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చని.. ఇవి శరీరానికి శక్తినిస్తాయని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. ఖర్జూరాలు తింటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఈ కథనంలో తెలుసుకోండి..
ఖర్జూరాలను అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు ఆకలిని దూరం చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల, ఖర్జూరాలు మిమ్మల్ని రోజంతా చురుకుగా శక్తివంతంగా ఉంచుతాయి.
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, బుద్ధిమాంద్యం, మానసిక సమస్యలు వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఖర్జూరాలు నివారిస్తాయి.
ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకంతో బాధపడుతున్న వారు ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.. ఇది ప్రేగులకు సంబంధించిన అనేక వ్యాధులను కూడా నయం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఖర్జూరం తినడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. ఖర్జూరంలో యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైటోహార్మోన్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య సమస్యను తగ్గించి యవ్వనంగా ఉంచుతాయి.. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఖర్జూరం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి నిగారింపును కూడా పెంచుతాయి.
ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.. అంతేకాకుండా.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఖర్జూరంలో కాల్షియం – ఇతర ఖనిజాలు ఉంటాయి.. ఇవి ఎముకలను, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.
దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.. అందుకే.. ఖర్జూరం తినడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు..
ఇలా ఖర్జూరాలను డైలీ ఆహారంలో చేర్చుకుంటే.. తక్కువ కాలంలోనే.. మార్పులు గమనించవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..