Weight Loss: దోసకాయను ఇలా తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గొచ్చు..

|

Sep 15, 2024 | 5:02 PM

దోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్, కాపర్, కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. బరువును కంట్రోల్‌ చేసుకోవాలనుకునే వారికి దోసకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దోసకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు...

Weight Loss: దోసకాయను ఇలా తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గొచ్చు..
Cucumber Water
Follow us on

దోసకాయ.. కాలంతో సంబంధం లేకుండా లభించే వాటిలో ఇదీ ఒకటి. దోసకాయలో పుష్కలమైన నీటి కంటెంట్‌ ఉంటుంది. అలాగే దోసకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోసకాయ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక బరువు తగ్గాలనుకునే వారు దోసకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్సన్‌గా చెప్పొచ్చు.

దోసకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్, కాపర్, కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయడంలో ఉపయోగపడతాయి. బరువును కంట్రోల్‌ చేసుకోవాలనుకునే వారికి దోసకాయ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దోసకాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

దోసకాయలోని ఎరెప్సిన్ అనే పదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణాశయంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఉపయోగం పడుతుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. దోసకాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా ఆకలి తీరిన భావన కలుగుతుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దోసకాయ వాటర్‌ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. దోసకాయ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా దోసయాను తీసుకొని.. తొక్కను పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత దోసకాయను చిన్న చిన్న ముక్కులుగా చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. అనంతరం అందులో నీటిని పోసుకోవాలి. నీటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. రాత్రంగా ఇలా నానబెట్టిన నీటిని ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోయి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..