Apple Seeds Poisonous : వామ్మో.. యాపిల్‌ గింజల ద్వారా ఇంత డేంజరా..! వెంటనే తెలుసుకోండి..

|

Apr 03, 2021 | 3:32 PM

Apple Seeds Poisonous : తియ్యగా ఉంటుందని యాపిల్‌ తింటున్నారా.. అయితే మంచిదే కానీ వాటి గింజలను మాత్రం పొరపాటున కూడా నములొద్దు..

Apple Seeds Poisonous : వామ్మో.. యాపిల్‌ గింజల ద్వారా ఇంత డేంజరా..! వెంటనే తెలుసుకోండి..
Apple Seeds Poisonous
Follow us on

Apple Seeds Poisonous : తియ్యగా ఉంటుందని యాపిల్‌ తింటున్నారా.. అయితే మంచిదే కానీ వాటి గింజలను మాత్రం పొరపాటున కూడా నములొద్దు.. ఎందుకంటే అందులో విషపదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఎదురవొచ్చు.. ఇంతకు ఆ గింజల్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్​ మన భాషలో ‘సేపు’ రోజుకొకటి తింటే డాక్టర్​ తో పని ఉండదు! అయితే అలాంటి పండులో విషపూరిత పదార్థాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? యాపిల్​ పండ్లపై సైంటిస్టులు చేసిన ఓ రీసెర్చిలో ఓ చేదు విషయం వెలుగులోకి వచ్చింది. యాపిల్​ విత్తనాల్లో ‘ఎమిగ్​డాలిన్’​ అనే కెమికల్​ సమ్మేళన పదార్థం ఉంటుంది. ఇది మన జీర్ణప్రక్రియ ఎంజైమ్​లతో కలిసిందంటే సైనెడ్​ విడుదలవుతుంది. ఈ విత్తనాలను మింగితే ఏమీ కాదు కానీ.. నమిలిమింగితే మాత్రం డేంజరే. ఇందులో ఉండే విషపదార్థం మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని తేలింది. అయితే కాస్త ఊరటనిచ్చే మాట ఏమిటంటే ఎక్కువ మొత్తంలో నమిలిమింగితేనే డేంజర్​ అని చెబుతున్నారు. కనుక యాపిల్​ను సీడ్స్​ తీసి తింటే మంచిది.

సర్వే ప్రకారం 60 కిలోల బరువు ఉన్న 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 నుంచి 175 విత్తనాలు తినడం వల్ల చనిపోతారట. అదే పదేళ్లలోపు చిన్నారులు 50 తిన్నా చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తినే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని తినే విషయంలో ఏ మత్రం అజాగ్రత్తగా ఉన్న భవిష్యత్‌లో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Indigo Baggage Service: ఇకపై ఎయిర్‌పోర్టుకు లగేజ్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. సరికొత్త సేవలను ప్రారంభించిన ఇండిగో..

జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా

Viral News: దొంగతానికి వెళ్తే.. కంటపడ్డ ఊహించనంత సొమ్ము.. వెంటనే దొంగకు గుండె నొప్పి.. కట్ చేస్తే..