కొబ్బరి నూనెతో వంట చేస్తే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే…

కొబ్బరి నూనె ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. కొబ్బరి నూనె గుండె సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను డైట్‌లో చేర్చుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరి నూనెతో వంట చేస్తే ఏమౌతుందో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే...
Coconut Oil

Updated on: Jun 30, 2025 | 9:03 AM

కొబ్బరి నూనె.. కేవలం జుట్టు కోసం మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ, చాలా మంది కొబ్బరి నూనెతో వంటలు కూడా చేస్తుంటారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణనులు కూడా చెబుతున్నారు. కొబ్బరి నూనెను వంటల్లో రెగ్యులర్‌గా వాడటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొబ్బరి నూనె రోజు ఎంతో కొంత వంటలో వాడడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొబ్బరినూనె..శరీరంలో కొవ్వును వేగంగా కరిగించే శక్తి కలిగి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కొబ్బరి నూనె.. LDL చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది.

బక్టీరియాను కంట్రోల్ చేస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ కొద్దిగా వాడితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అన్నం ఉడికించేటప్పుడు అర స్పూన్ కొబ్బరి నూనె వేస్తే బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, లౌరిక్ యాసిడ్ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ వంటల్లో కాస్త కొబ్బరి నూనె ఉపయోగించండి. ఈ నూనె వంటలకు మంచి టేస్ట్ కూడా ఇస్తుంది.

కొబ్బరినూనెను వంటల్లో వినియోగించడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినూనెతో తయారు చేసిన వంటలు తింటే మంచిది. హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంచడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది. కొబ్బరి నూనెను వంటల్లో వాడడం వల్ల మూడ్‌ స్వింగ్స్‌ తగ్గుతాయి. మానసిక సమస్యలు రావు. కొబ్బరి నూనెతో తయారు చేసిన వంటలు తింటే ఎనర్జీ రెట్టింపు అవుతుంది. కొబ్బరి నూనెను వంటల్లో వాడడం వల్ల నీరసం రాదు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. స్కిన్ డ్రై అయిపోకుండా చూసుకుంటుంది. కొబ్బరినూనెను అప్లై చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. కొబ్బరినూనెను వంటల్లో వాడడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. మెటాబలిజం రేటును కూడా పెంచుకోవచ్చు. కొబ్బరి నూనె జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఇందులో విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి.

కొబ్బరి నూనె ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. కొబ్బరి నూనె గుండె సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నూనెను డైట్‌లో చేర్చుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..