
మీరు ఎవరికైనా చాక్లెట్ బహుమతిగా ఇచ్చి ఉంటారు లేదా కొన్నిసార్లు మూడ్ ని మార్చుకోవడానికి చాక్లెట్ ని తింటూ ఉంటారు. పిల్లలు అయినా, పెద్దలు అయినా, అందరికీ చాక్లెట్ అంటే ఇష్టం. అందుకే చాక్లెట్ ని తినే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే చాక్లెట్ చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? చాక్లెట్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ని ముఖం మీద అప్లై చేయడం ద్వారా గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లు ముఖంపై పేరుకున్న మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రంగా చేస్తుంది. కనుక ఇక నుంచి చాక్లెట్ తినడంతో పాటు, చాక్లెట్ ఫేస్ మాస్క్ ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.
అయితే చాక్లెట్ చర్మానికి ఎలా మేలు చేస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేయడం సురక్షితమేనా వంటి అనేక ప్రశ్నలు మనస్సులో మెదులుతూ ఉంటాయి. కనుక ఈ రోజు చర్మ సంరక్షణలో చాక్లెట్‌ను ఎలా భాగంగా చేసుకోవచ్చో తెలుసుకుందాం. తద్వారా మీ చర్మం మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.
డార్క్ చాక్లెట్‌లో కాటెచిన్‌లు, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాల్స్ ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. ఇది మీకు ప్రకాశవంతమైన, మచ్చలేని చర్మాన్ని ఇస్తుంది.
చాక్లెట్ ,షుగర్ పేస్ మాస్క్ తయారు చేయడానికి 2 డార్క్ చాక్లెట్లు, 4-5 చెంచాల పాలు, 3 చెంచాల బ్రౌన్ షుగర్ మరియు 1 చెంచా ఉప్పు అవసరం. ముందుగా చాక్లెట్ కరిగించి దానిలో ఉప్పు , చక్కెర కలపండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి.. ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ మాస్క్ మీ చర్మాన్ని మృదువుగా , కాంతి వంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
చాక్లెట్ .. అరటిపండు ఫేస్ మాస్క్ తయారు చేయడానికి 2 టీస్పూన్ల కోకో పౌడర్, 1 టీస్పూన్ తేనె, అర కప్పు గుజ్జు చేసిన అరటిపండు, 1 టీస్పూన్ పెరుగు అవసరం. ఈ వస్తువులన్నింటినీ కలిపి పేస్ట్ లా చేసి ముఖం , మెడపై అప్లై చేసి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి అర కప్పు కోకో పౌడర్, 3 చెంచాల ఓట్ మీల్, 1 చెంచా క్రీమ్, తేనె కలపండి. తర్వాత ముఖం, మెడపై 20 నిమిషాలు అప్లై చేసి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఈ మాస్క్ తయారు చేయడానికి మీకు 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పెరుగు, అర కప్పు కోకో పౌడర్, సగం నిమ్మకాయ అవసరం. ఈ వస్తువులన్నింటినీ కలిపి ఈ ఫేస్ మాస్క్‌ను ముఖంపై 30 నిమిషాలు అప్లై చేసి, ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ముఖం మీద నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ మాస్క్ తయారు చేయడానికి 2 టీస్పూన్ల కోకో పౌడర్, 1 టీస్పూన్ పసుపు పొడి , 2 టీస్పూన్ల పాలు కలిపి ముఖం మీద 20 నిమిషాలు అప్లై చేయండి. ఇది మీకు మచ్చలేని, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)