చిన్న పిల్లలు తరచుగా మట్టిని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇది వారికి ఒక అలవాటుగా మారుతుంది. పిల్లల ఈ అలవాటు వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలు మట్టి తినడం ఆపలేరు. మీ బిడ్డ కూడా మట్టిని తింటున్నాడా..? మీరు కూడా వాడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే, మీ కోసమే ఈ సమాచారం. ఇలాంటి కొన్ని నివారణ చిట్కాల ద్వారా మీరు పిల్లలు మట్టి తినే అలవాటును మాన్పించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పిల్లలు మట్టిని ఎందుకు తింటారు?
మట్టిలో టేస్ట్ ఉంటుంది. ఏ పిల్లలు మట్టిని తినడానికి ఇష్టపడతారు? శరీరంలో కాల్షియం, ఐరన్ లేకపోవడం వల్ల పిల్లలు మట్టిని తినడానికి అలవాటు పడతారని ముందుగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు మట్టి తినే రుగ్మత, పిల్లల ఉత్సుకత కారణంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా మట్టి తినే అలవాటు పోషకాల కొరత కారణంగా సంభవిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా వారికి కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పిల్లల పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
పిల్లలకు అరటిపండ్లు తినిపించండి..
అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం నిండిఉంటుంది. పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. దీనితో వారిలో కాల్షియం అవసరం పెరుగుతుంది. మట్టి తినే అలవాటును క్రమంగా వదిలించుకుంటారు. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు.
పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న వాటిని మాత్రమే తిననివ్వండి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత కాల్షియం మందులు కూడా వాడుతుండాలి.
లవంగం నీరు ప్రభావవంతంగా ఉంటుంది
పిల్లలకు బురద తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6-7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలకు తాగించండి. ఈ పరిహారం పని చేస్తుంది. కొన్ని రోజుల్లో పిల్లలు మట్టి తినడం మానేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.