
మనం ఇప్పటి వరకు ఎగ్, చికెన్, బ్రెడ్ ఇలా రక రకాల పదార్థాలతో ఆమ్లెట్ చేసుకుని తిన్నాము. అయితే, ఈ సారి కొంచం కొత్తగా ట్రై చేద్దాం. అంటే, మీరు ఇప్పటి వరకు ట్రై చేయని రెసిపీ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: చికెన్ స్కిన్ 150 గ్రాములు , 2 టేబుల్ స్పూన్స్ నూనె , 2 కోడి గుడ్లు, ఉల్లిపాయ చిన్నది ఒకటి, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర.

కోడి తోలు ఆమ్లెట్ తయారీ విధానం: ముందుగా చికెన్ స్కిన్ ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకుని పసుపు, కారం ఉప్పు వేసి కలిసిపోయే వరకు గరెటితో తిప్పి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి.

ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి చికెన్ స్కిన్ ను లైట్ గా నూనెలో వేయించండి. ఇలా చేయడం వలన పచ్చిదనం పోతుంది. ఇక ఇప్పుడు ఆ చికెన్ స్కిన్ ను ముందుగా పెట్టుకున్న బౌల్ లో వేసుకుని దానిలో కోడిగుడ్లను కొట్టి ధనియాల పొడ, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిసే పోయే వరకు తిప్పుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి గిన్నెలో కలిపిన కోడిగుడ్ల మిశ్రమాన్ని పోయండి. ఆ తర్వాత కొత్తిమీర కొంచం చల్లుకొని మూతపెట్టేయండి. కొద్దీ సేపటి తర్వాత ఆమ్లెట్ ను రెండు వైపులా తిప్పుతూ.. అది కాలిన తర్వాత దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే వేడి వేడి కోడి తోలు ఆమ్లెట్ రెడీ.