
చికెన్, మటన్‌ను ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులు ఫుల్లుగా లాగించేస్తారు. పలు రకాల వంటకాలను రుచిగా వండుకుని.. ఆస్వాదిస్తూ తింటారు.. అయితే.. కోడి కాళ్లు తింటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. వాస్తవానికి కోడి కాళ్ళు తినడం మనిషి శరీరానికి ఎంత మంచిదో అన్న విషయం చాలా మందికి తెలియదు. చికెన్ లెగ్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ కోడి కాళ్ళ కూర, సూప్ రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.
మొదటగా, కోడి కాళ్ళు తినడం వల్ల శరీరంలోని ఎముకలు చాలా బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు తగ్గి, ఎముకలకు శక్తి లభిస్తుంది. ఎముకలకు సంబంధించిన నొప్పులు ఉన్నవారు వీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇది నొప్పులను తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది.
కోడి కాళ్ళు కండరాల వృద్ధికి తోడ్పడతాయి. వ్యాయామం చేసేవారు, జిమ్‌కు వెళ్లి కండలు పెంచాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభించి, వ్యాయామం సరిగా చేయగలుగుతారు. సరైన నియమాలు పాటిస్తూ వారానికి రెండు, మూడుసార్లు వీటిని తింటే బరువు పెరగడమే కాకుండా కండరాలు కూడా వృద్ధి చెందుతాయి.
కోడి కాళ్ళు తినడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.. యవ్వనంగా కనిపిస్తారు. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవారు అలసిపోయినట్లుగా ఉండటం, శరీర నొప్పులు కలిగి ఉండటం గమనించవచ్చు. అలాంటి వారు వారానికి రెండుసార్లు కోడి కాళ్ళు తినడం ద్వారా కాల్షియం లోపాన్ని సరిచేసుకోవచ్చు. కోడి కాళ్ళు చర్మాన్ని శుభ్రంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి
కోడి కాళ్ళు బలహీనతను దూరం చేస్తాయి. శరీరం బలహీనపడటం, రక్తహీనత, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి పోషకాహారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వారు క్రమం తప్పకుండా కోడి కాళ్ళు తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే శరీరంలో మార్పులు గమనించవచ్చు.
ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కోడి కాళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంది నిపుణులు ఈ చికెన్ లెగ్స్ తినడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు వారానికి రెండు, మూడుసార్లు వీటిని తింటూ ఉంటే క్రమంగా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మందులతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
శారీరక సమస్యలను పరిష్కరించడంలో కోడి కాళ్లు ఇవి సహాయపడతాయి. నిపుణుల ప్రకారం, కోడి కాళ్ళ సూప్ తాగడం పురుషులలో అంగస్తంభన సమస్యలను కూడా తగ్గించగలదు.
చలికాలంలో కోడి కాళ్ళు తినడం చాలా మంచిది. ఇవి సహజంగానే వేడిని కలిగి ఉంటాయి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి ఇవి రక్షిస్తాయి.
కోడికాళ్లు.. వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో ఇవి సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు, శరీర నొప్పులు తగ్గి, మనిషి చురుకుగా ఉంటారు. వయసు పెరిగినా ముఖం మీద వృద్ధాప్య ఛాయలు కనిపించవని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు
ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, కోడి కాళ్ళను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.. అయితే.. కోడికాళ్లను కూరగా.. లేదా సూప్ గా చేసుకుని తినవచ్చు.. కోడి కాళ్ల కూరను చికెన్ కర్రీ మాదిరిగా చేసుకోవచ్చు.. కోడి కాళ్ల సూప్ తయారీకి కోడి కాళ్లను శుభ్రం చేసి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మసాలాలతో వేయించి, నీళ్లు పోసి ఉడికించాలి.. చివరిలో కొత్తిమీర, నిమ్మరసం జోడించి, రుచికి తగినట్టు ఉప్పు, మిరియాల పొడి సర్వ్ చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..