AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. వీటిలో ఏది బెస్ట్.. 100% ఎవ్వరికీ ఇది తెలియదు..

చియా సీడ్స్, సబ్జా సీడ్స్ రెండూ పోషకాలు కలిగిన గింజలే అయినప్పటికీ, వాటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల పరిమాణంలో తేడాలు ఉంటాయి. చియా గింజల్లో ఒమేగా-3 అధికంగా ఉండగా, సబ్జా గింజలను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ రెండు గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా వాటి వినియోగం సులభమవుతుంది. అయితే పోషక విలువలు గింజల రకం, పరిమాణాన్ని బట్టి మారవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవడానికి వాటి పోషక ప్రయోజనాలు, వినియోగ విధానాలను తెలుసుకోండి.

చియా సీడ్స్ vs సబ్జా సీడ్స్.. వీటిలో ఏది బెస్ట్.. 100% ఎవ్వరికీ ఇది తెలియదు..
Chia Seeds Vs Sabja Seeds
Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2026 | 6:50 PM

Share

ఆరోగ్య స్పృహ పెరిగిన ఈ కాలంలో, అనేక పోషక విలువలున్న ఆహార పదార్థాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి వాటిలో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ప్రధానమైనవి.. ఈ రెండు గింజలు కూడా తమ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలతో పేరుగాంచాయి. అయితే, వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే.. వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చియా సీడ్స్ – సబ్జా సీడ్స్.. ఈ రెండు గింజల పోషక విలువలను, వాటి మధ్య ఉన్న తేడాలను స్పష్టంగా తెలుసుకుందాం..

సులభంగా జీర్ణమయ్యే పోషకాలు

సాధారణంగా, గింజలు కొద్దిగా గట్టిగా ఉంటాయి.. వాటిని నమలడం, తినడం కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే, చియా సీడ్స్, సబ్జా సీడ్స్ విషయంలో ఇది భిన్నం.. ఈ రెండు రకాల గింజలను పావుగంట నుండి ఇరవై నిమిషాల ముందు నీటిలో నానబెట్టినట్లయితే, అవి నీటిని పీల్చుకొని ఉబ్బి, మెత్తగా తయారవుతాయి. అప్పుడు వాటిని నమలాల్సిన అవసరం లేకుండానే సులభంగా మింగవచ్చు.. తాగవచ్చు. ఈ మెత్తబడిన గింజలు తేలికగా జీర్ణం అవుతాయి.. తద్వారా శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయి.

పోషక విలువల్లో సారూప్యతలు, భేదాలు..

నిపుణుల ప్రకారం.. బలం, సాధారణ ప్రోటీన్, ఇతర పోషకాలు, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఈ రెండు గింజల్లోనూ దాదాపు సమానంగానే ఉంటాయి. ఈ పోషకాల పరంగా చూస్తే, రెండూ మంచివే అని చెప్పవచ్చు. అయితే, కొన్ని కీలకమైన పోషకాల విషయంలో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ కంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఫైబర్ (పీచు పదార్థం):

ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన ఫైబర్ విషయంలో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ కంటే ముందున్నాయి. సబ్జా గింజల్లో దాదాపు 22-23% ఫైబర్ ఉంటుంది. అదే చియా సీడ్స్ లో అయితే, ఏకంగా 34% ఫైబర్ ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరుకు, మలబద్ధకం నివారణకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఫైబర్ చాలా అవసరం. అధిక ఫైబర్ ఉండటం వల్ల చియా సీడ్స్ ఈ ప్రయోజనాలను మరింత సమర్థవంతంగా అందిస్తాయి.

ప్రోటీన్ (మాంసకృత్తులు):

కండరాల నిర్మాణానికి, కణజాలాల మరమ్మత్తుకు, ఎంజైముల ఉత్పత్తికి ప్రోటీన్ తప్పనిసరి. ప్రోటీన్ విషయంలో కూడా చియా సీడ్స్ ఉత్తమమైనవిగా నిలుస్తాయి. సబ్జా గింజల్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటే, చియా సీడ్స్ లో 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు, అలాగే సాధారణ ప్రజలకు కూడా అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం ఎంతో మేలు చేస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చియా సీడ్స్ ప్రత్యేకత

చియా సీడ్స్ ను నంబర్ వన్ గా నిలబెట్టే ప్రధాన పోషకం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, కంటి చూపునకు, శరీరంలో మంటను తగ్గించడానికి ఎంతో అవసరం. సబ్జా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దాదాపుగా సున్నా శాతం ఉంటాయి. కానీ, చియా సీడ్స్ లో 18 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి రోజుకు సుమారు 1.6 గ్రాముల ఒమేగా-3 అవసరం కాగా, కేవలం 10 గ్రాముల చియా సీడ్స్ ను నీటిలో నానబెట్టి తీసుకుంటే, ఈ అవసరాన్ని సులభంగా తీర్చవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఫైబర్, ప్రోటీన్, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విషయంలో చియా సీడ్స్ సబ్జా సీడ్స్ కంటే గణనీయంగా మెరుగైనవి.. మీ రోజువారీ ఆహారంలో చియా సీడ్స్ ను చేర్చుకోవడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పైన చెప్పిన విధంగా చియా గింజలే నెంబర్ వన్ అనడానికి ఈ పోషక విలువల తేడాయే ప్రధాన కారణం అని పేర్కొంటున్నారు.. వాస్తవానికి సరైన పోషకాహారాన్ని, మంచి జీవనశైలిని పొందడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us