శ్రావణ మాసంలో పుట్టిన పిల్లల ప్రత్యేకత ఏంటో తెలుసా..? వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..

|

Aug 01, 2023 | 10:44 AM

అలాంటి వారిని పరమశివుడు అనుగ్రహిస్తాడు. ఈ వ్యక్తులు తరచుగా తమ నిర్ణయాలను మనస్సు నుండి కాకుండా హృదయం నుండి తీసుకుంటారు.

శ్రావణ మాసంలో పుట్టిన పిల్లల ప్రత్యేకత ఏంటో తెలుసా..? వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..
Shravana Masam Birth Stars
Follow us on

Shravana Masam: శ్రావణ మాసంలో పుట్టిన వారి మనసులో మోసం ఉండదు. వారి మనస్సు నిష్కళంకమైనది. దీని కారణంగా అందరూ అతన్ని ఇష్టపడతారు. అతని స్వభావం కూడా కొంతవరకు శివుని పోలి ఉంటుందని అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. శ్రావణ మాసంలో పుట్టిన వారు జీవితాంతం శివుని అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం సాధిస్తారు. అంతేకాదు.. వీరు ప్రతి సంబంధంతో నిజాయితీగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్నేహితుడి కంటే తక్కువ, అయిన కూడా వారితో నిజాయితీగా ఉంటాడు.

శ్రావణమాసంలో పుట్టిన వారు క్రీడలు, వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు తమ కార్యకలాపాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. శివుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. దేనికి ఇబ్బంది ఉండదు. అంతేకాదు.. వీరు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరితోనైనా త్వరగా ప్రేమలో పడతారు. ఇతర వ్యక్తులు వారి లక్షణాలు, స్వభావంతో సులభంగా ఆకర్షితులవుతారు. శ్రావణ రాశిలో పుట్టిన వారు అదృష్టవంతులు. అలాంటి వారిని పరమశివుడు అనుగ్రహిస్తాడు. ఈ వ్యక్తులు తరచుగా తమ నిర్ణయాలను మనస్సు నుండి కాకుండా హృదయం నుండి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

శ్రావణ మాసంలో పుట్టిన పిల్లలు ప్రతి సందర్భంలోనూ శివుడిలా చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ, కోపం వచ్చినప్పుడు మాత్రం ఉగ్రంగా కనిపించాలి. అలాగే, ఆగస్టు నెలలో పుట్టిన వారికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు, సూచనలపై వారు ఆధార అడగకుండానే వారి నిర్ణయాలు స్వతహాగా తీసుకుంటారు. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువ. వీరికి ఇతరులను గెలిచే అదృష్టం సత్తా ఉంటుంది. అన్నీ విషయాల్లోనూ ముందుంటారు. వారు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి ఆశ్చర్యపడే పనులు చేస్తారు. వీరు తలపెట్టిన పనులు ఆగవు.. అలా అగిపోతే, వారు తట్టుకోలేరు. కష్టాలు అనుభవిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..