Chanakya Niti: చెప్పుడు మాటలు గుడ్డిగా నమ్మేవారి జీవితం చివరకు ఇలా ఉంటుంది.. తీరు మార్చుకోకుంటే తిప్పలు తప్పవ్

కొంతమంది ఇతరులను గుడ్డిగా నమ్మి, ప్రతి విషయంలోనూ వారి మాటనే పాటిస్తారు. ఆచార్య చాణక్యుడు ఇలాంటి వారికి గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. ఇలాంటి చెప్పుడు మాటలు ఇటువంటి వ్యక్తుల జీవితాన్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తాయి. ఇది ఖచ్చితంగా మంచి అలవాటు కాదు. కాబట్టి ఇతరుల మాటలు వినడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Chanakya Niti: చెప్పుడు మాటలు గుడ్డిగా నమ్మేవారి జీవితం చివరకు ఇలా ఉంటుంది.. తీరు మార్చుకోకుంటే తిప్పలు తప్పవ్
Why Blind Trust Is A Danger

Updated on: May 16, 2026 | 8:35 PM

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కేవలం విజయం, సంపద, సంబంధాల గురించే మాత్రమేకాకుండా మనకు సరైన మార్గాన్ని చూపించే అనేక జీవిత పాఠాలను బోధించారు. మనం ఇతరులను గుడ్డిగా నమ్మినప్పుడు ఎదురయ్యే కొన్ని ప్రమాదాలను కూడా ఆయన ప్రస్తావించాడు. ఇతరులను గుడ్డిగా నమ్మడం, ఎల్లప్పుడూ ఇతరుల మాటలే వినడం అలవాటుగా ఉంటే అలాంటి వారు త్వరగా వినాశనం వైపు పయనిస్తారని ఆయన హెచ్చరించాడు. కాబట్టి ఈ ఒక్క తప్పు వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇతరుల మాటలు వినడం మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం క్షీణిస్తుంది

ఆచార్య చాణక్యుని ప్రకారం ఒక వ్యక్తి ఇతరులను గుడ్డిగా నమ్మినప్పుడు అతను ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని త్వరగా కోల్పోతాడు. కొన్నిసార్లు ఇతరుల మాటల వెనుక స్వార్థపూరిత, దురుద్దేశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు వారి మాటలను నమ్మి తప్పుడు మార్గంలో నడిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలహీనపడుతుంది

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా ఇతరుల సలహాలు తీసుకోవడం, తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేసినప్పుడు.. చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడటం అలవాటు అవుతుంది. ఇది ఆలోచనా, గ్రహణ శక్తిని బలహీనపరుస్తుంది. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఆత్మవిశ్వాసం కోల్పోవడం

చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రతిదానికీ ఇతరులపై ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు, ఇతరుల మాటలు విని ముందుకు సాగినప్పుడు, అతని ఆత్మవిశ్వాసం వేగంగా తగ్గిపోతుంది. ఒకానొక దశ తర్వాత అతను తనపై తాను నమ్మకం కోల్పోయి, జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి కేవలం ఇతరుల అభిప్రాయాలపైనే ఆధారపడే స్థితికి వస్తాడు. ఈ అలవాటు చివరికి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us