Healthy Heart: ఈ అలవాట్లు ఉంటే అరవై ఏళ్లకు రావల్సిన గుండె పోటు ఇరవై ఏళ్లకే.. తాజా అధ్యయనం హెచ్చరిక!

|

Dec 26, 2022 | 5:41 PM

సమస్య నివారణకు స్వల్పకాలిక పరిష్కారాల కోసం మాత్రమే చూస్తుంటారు. పరిస్థితిని లోతుగా అర్థం చేసుకోవడం, సమస్యను పరిష్కరించడానికి అవసరమైన జీవనశైలి మార్పులను చేయడాన్ని ఎవరూ పట్టించుకోరు..

Healthy Heart: ఈ అలవాట్లు ఉంటే అరవై ఏళ్లకు రావల్సిన గుండె పోటు ఇరవై ఏళ్లకే.. తాజా అధ్యయనం హెచ్చరిక!
Healthy Heart
Follow us on

అరవై, డెబ్బై ఏళ్లకు రావల్సిన గుండెపోటులు ప్రస్తుతకాలంలో ఇరవైలలోనే వస్తున్నాయి. పదేళ్ల క్రితం ఇటువంటి పరిస్థితులులేవు. ఉన్నట్టుంది మన గుండె ఆరోగ్యంలో ఈ మార్పులు ఎందుకు తలెత్తాయనేది ప్రతిఒక్కరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆరోగ్య నిపుణులు ఏంటున్నారంటే.. నేటి యువతలో గుండెపోటుకు గల ప్రధాన కారణం ధూమపానం. మరొకటి ఒత్తిడితో కూడిన జీవనశైలి. శారీరక ఆకృతిని మార్చుకోవడానికి జిమ్‌లలో శక్తికి మించి కసరత్తులు చేయడం. ఇవే నేటి యువతలో గుండెపోటు దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. గత కొన్ని నెలల్లో.. జిమ్‌లలో వర్కౌట్ చేస్తూ మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. స్పర్ష్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ వీరన్న ఏం చెబుతున్నారంటే..

సమస్య నివారణకు స్వల్పకాలిక పరిష్కారాల కోసం మాత్రమే చూస్తుంటారు. పరిస్థితిని లోతుగా అర్థం చేసుకోవడం, సమస్యను పరిష్కరించడానికి అవసరమైన జీవనశైలి మార్పులను చేయడాన్ని ఎవరూ పట్టించుకోరు. ఉదా: ఊబకాయం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఓట్స్ తినడాన్ని ఎంపిక చేసుకుంటారు. నిజానికి ఇది ఆరోగ్యకరమైన పరిష్కారం కాదు. ఈ విధమైన అలవాట్లు గుండెతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. బదులుగా ఏం చెయ్యాలంటే..

ఒత్తిడితో జాగ్రత్త..

ఒత్తిడి ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీస్తుంది. నిజానికి.. ఒత్తిడి (స్ట్రెస్‌) వల్ల కేవలం మనసు మాత్రమే ప్రభావితం అవుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒత్తిడి మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, లేట్ నైట్ షిఫ్ట్‌లు, క్రమంతప్పిన నిద్ర అలవాట్లతో యువతలో ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది పరోక్షంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకుంటే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అదేపనిగా కూర్చుని పనిచేయకపోవడం బెటర్‌..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం. చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంలోని కొవ్వు విచ్ఛిన్నమవుతుంది. కదలిక లేకుండా అలాగే కూర్చోవడం వల్ల, కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి..

నేటి డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్, పుస్తకాలు, సోషల్ మీడియాల ద్వారా ఆహార అలవాట్ల గురించిన సమాచారం కోకొల్లలుగా కల్లముందుకొస్తుంది. ఐతే వీటిని గుడ్డిగా అనుసరించకుండా ఆహార నిపుణుల పర్యవేక్షణలో మంచి ఆహార అలవాట్లను పాటించాలి. ఎందుకంటే సరైన కోచ్‌లేకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తే ఏ విధంగానైతే ప్రయోజనం ఉండదో.. సరైన మార్గదర్శకత్వం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం కూడా శరీరానికి అందదు. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారాలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఆకుకూరలు, పప్పులు, మొలకలు మొదలైన వాటితో కూడిన ఆహారాలు తీసుకోవాలి.

వారానికోసారి సెలవు తీసుకోవాలి..

ఒత్తిడిని నియంత్రించే ఏకైక మార్గం ధ్యానం. వారానికి కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండాలి. అధ్యయనాల ప్రకారం.. వారానికి 4 నుండి 5 రోజులు పని చేసే వ్యక్తులతో పోలిస్తే వారానికి 7 రోజులు పనిచేసే వ్యక్తులు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పనిలో మెరుగుదల కనిపించాలంటే వారానికోసారి సెలవు తప్పనిసరి. అలాగే మంచి నిద్ర అవసరం. వ్యక్తికి ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి.

ఈ అలవాట్లకు దూరం.. దూరం..

అతి చిన్న వయస్సులోనే ధూమపానం మానేయడం అంతమంచిది కాదు. బదులుగా..అసలు స్మోకింగ్ అలవాటు ప్రారంభించకపోవడమే బెటర్‌. కొవ్వు, చక్కెర పదార్ధాలను తినకూడదు. 20, 30 ఏళ్ళ ప్రారంభంలో ఉండేవారు రోజుకు 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలి లేదా రోజుకు 5000 నుంచి 10,000 అడుగులు నడవడం మంచిది. కష్టపడి కసరత్తులు కేయడం కన్నా బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఏదైనా ఆట ఆడటం మంచిదని డాక్టర్  విక్రాంత్ వీరన్న అంటున్నారు.

మరిన్ని జీవనశైలి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.