బొమ్మలు అనేవి బాల్యంలో ముఖ్యమైన భాగం. చాలా మంది తమ చిన్నతనంలో ఏదో ఒక రకమైన బొమ్మతో ఆడుకుంటారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం బొమ్మలు కూడా అభివృద్ధి చెందాయి. ఇంతకు ముందు మెత్తని బొమ్మలు ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అనేక రోబోటిక్ బొమ్మలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. బొమ్మల మార్కెట్ నిరంతరం మార్పులను చేస్తోంది. పిల్లల కోసం సరికొత్త పురోగతితో వస్తోంది. అయితే ఈ బొమ్మలు కొనే విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
అనేక కంపెనీలు పిల్లలకు వినోదం కోసం ఒక ప్రముఖ వనరుగా మారిన బొమ్మలను కూడా అభివృద్ధి చేశాయి. ఇటీవలి సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 7 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం బొమ్మల కోసం నాణ్యత నియంత్రణ ఆర్డర్ (క్యూసీఓ)ని అమలు చేసింది. ఈ క్రమంలో బొమ్మల నాణ్యతను కాపాడుకోవాలంటే వాటిపై ప్రత్యేక గుర్తును ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు బొమ్మలు కొనే ముందు ఈ ప్రత్యేక గుర్తును చూసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం 7 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం బొమ్మల కోసం బీఐఎస్ చట్టం, 2016 సెక్షన్ 16 ప్రకారం 2020 కోసం టాయ్స్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యూసీఓ)ని జారీ చేసింది. బొమ్మల నాణ్యతను కాపాడేందుకు బొమ్మల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై ఐఎస్‌ఐ గుర్తు పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులు కూడా బొమ్మలపై ఐఎస్ఐ గుర్తు ఉండేలా చూడాలని సూచించారు. బొమ్మలపై ఐఎస్ఐ గుర్తు లేకుంటే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1915కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.
ఈ చట్టం ప్రకారం ఐఎస్‌ఐ గుర్తు లేని బొమ్మలను విక్రయించడానికి వ్యాపారం చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి లేదా నిల్వ చేయడానికి అనుమతించకూడదు. గత కొన్ని సంవత్సరాలుగా బొమ్మలు పిల్లలకు గాయాలు, ఆరోగ్య సమస్యలను కలిగించే వివిధ సందర్భాలు ఉన్నాయి. బొమ్మలపై పదునైన అంచులు లేదా పాయింట్ల కారణంగా శారీరక గాయపడే ప్రమాదం కూడా ఉంది. బొమ్మల తయారీలో వాడే కెమెకల్స్ సమ్మేళనాలు పిల్లల ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. బొమ్మల నాణ్యతను నిర్వహించడానికి అనేక చెక్‌లిస్ట్‌లు అందించబడ్డాయి. ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది బొమ్మలపై ఐఎస్ఐ గుర్తు లేకుండా బొమ్మలు అమ్ముతున్నారు. ఈ బొమ్మలు ఎక్కువగా స్థానిక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి పిల్లలకు చాలా హాని కలిగిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…