మజ్జిగల్లో ఒక్క స్పూన్‌ ఈ పదార్థాన్ని కలిపి తీసుకున్నారంటే.. బంపర్‌ బెనిఫిట్స్‌.. తెలిస్తే ఎగిరి గంతేస్తారండోయ్..!

పెరుగును చిలకడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా వేసుకోవడం వల్ల దాని రుచి పెరుగుతుంది. మజ్జిగ సూపర్‌ సమ్మర్‌ స్పెషల్ డ్రింక్‌ అవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, మజ్జిగలో ఒక్క స్పూన్‌ అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని మీకు తెలుసా..?

మజ్జిగల్లో ఒక్క స్పూన్‌ ఈ పదార్థాన్ని కలిపి తీసుకున్నారంటే.. బంపర్‌ బెనిఫిట్స్‌.. తెలిస్తే ఎగిరి గంతేస్తారండోయ్..!
Butter Milk With Ginger

Updated on: Feb 19, 2026 | 12:51 PM

వేసవి కాలంలో మనల్ని మనం చల్లగా ఉంచుకోవడానికి ఆహారంలో అనేక పదార్థాలను చేర్చుకుంటాము. కాలానుగుణ పండ్లు, కూరగాయలతో పాటు వివిధ రకాల పానీయాలను కూడా తీసుకుంటాము. వీటన్నింటిలో అతి ముఖ్యమైనది మజ్జిగ. పెరుగును చిలకడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఉప్పు, జీలకర్ర పొడి, పుదీనా వేసుకోవడం వల్ల దాని రుచి పెరుగుతుంది. మజ్జిగ సూపర్‌ సమ్మర్‌ స్పెషల్ డ్రింక్‌ అవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, మజ్జిగలో ఒక్క స్పూన్‌ అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని మీకు తెలుసా..?

మజ్జిగలో చెంచా అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే చాలా మంచిదని పోషకాహార, ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మజ్జిగలో కలుపుకొని తాగితే బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోని లాక్టోజ్‌, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ప్రతిరోజూ గ్లాసుడు మజ్జిగలో ఒక స్పూన్‌ అల్లం రసం కలిపి తాగడం వల్ల కొవ్వు కణాల విచ్ఛిన్నం ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. అల్లం యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో మజ్జిగ, అల్లం రసాన్ని చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆక‌లి లేని వారు మ‌ధ్యాహ్నం గ్లాస్ మ‌జ్జిగ‌లో కొద్దిగా అల్లం ర‌సం, ఉప్పు, కొత్తిమీర క‌లిపి తాగితే ఫలితం ఉంటుంది.. దీంతో ఆక‌లి పెరుగుతుంది. అజీర్ణం త‌గ్గుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us