Black Carrot :నల్లగా ఉన్నాయని దూరం పెట్టొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే.. వెతికి మరీ తెచ్చుకుంటారు..

Black Carrot Benefits : ప్రకృతిలో రకరకాల కూరగాయలు, పండ్లు ఉన్నాయి. వీటిలో మనకు కొన్నింటి గురించి మాత్రమే తెలుసు. సాధారణంగా మనం ఇప్పటి వరకు ఆరెంజ్ కలర్ క్యారెట్స్‌ను మాత్రమే చూసిం ఉంటాం. కర్యారెట్‌ అతనగా మనకు గుర్తొచ్చె రంగు కూడా అదే.. కానీ వీటిలో నలుపు రంగు క్యారెట్‌ కూడా ఉంటుందని.. ఇది కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ బ్లాక్ క్యారెట్‌ను ఎక్కడ పండిస్తున్నారు.. వాటిని ప్రయోజనాలు ఏంటి.. బ్లాక్, నారింజ రంగు క్యారెట్‌కు మధ్య తేడా ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Black Carrot :నల్లగా ఉన్నాయని దూరం పెట్టొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే.. వెతికి మరీ తెచ్చుకుంటారు..
Black Carrot Benefits

Updated on: Nov 24, 2025 | 1:16 PM

క్యారెట్‌ అనగానే మనకు గుర్తొచ్చేది నారింగ రంగు క్యారెట్‌. కానీ ఇందులోనూ రకాలు ఉంటాయని మీకు తెలుసా?.. క్యారెట్‌ ఆరెంజ్‌ మాత్రమే కాకుండా బ్లాక్‌ కలర్ క్యారెట్‌ కూడా ఉంటుంది. వీటిని ఎక్కువగా నార్త్‌ ఇండియాలో పండిస్తారు. అయితే ప్రస్తుతం దక్షణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో కూడా వీటిని సాగు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఢిల్లీ నుంచి విత్తనాలు కొనుగోలు చేసి కున్నూర్‌లోని సిమ్స్‌ పార్కు నర్సరీలో పైలట్‌ ప్రాజెక్టుగా వీటిని సాగు చేస్తున్నారు.

ఈ బ్లాక్ క్యారెట్ పంట 3 నుంచి మూడున్నర నెలల్లో పూర్తవుతుంది. నార్త్‌లో వీటిని ఎక్కువగా కేక్‌ తయారీకి ఉపయోగిస్తుంటారు. అలాగే కొందరు రోజువారి ఆహారంలో కూడా వీటిని చేర్చుకుంటారు. ఆరెంజ్ క్యారెట్‌ల వలే ఇవి కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతాయి. 100 గ్రాముల బ్లాక్ క్యారెట్లలో 35 కేలరీలు, 8.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.9 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రోటీన్ ఉంటాయి. ఇంకా, బ్లాక్ క్యారెట్లలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో మీరు వీటిని తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందచ్చు.

శీతాకాలంలో బ్లాక్ క్యారెట్లు ఎందుకు తినాలి?

వైద్య నిపుణుల ప్రకారం.. శీతాకాలం బ్లాక్ క్యారెట్లు తినడానికి ఉత్తమ సమయం, ఎందుకంటే ఈ సీజన్‌లో అవి తాజాగా సూలభంగా లభిస్తాయి. కాలుష్య ప్రభావాల నుండి రక్షించడంలో బ్లాక్ క్యారెట్లు కూడా ఉపయోగపడతాయి. ఇంకా, శీతాకాలం తరచుగా జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాలను తెస్తుంది. కాబట్టి బ్లాక్ క్యారెట్లలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీంతో అనారోగ్యం నుండి రక్షిస్తాయి.

జీర్ణక్రియకు మేలు చేస్తుంది

బ్లాక్ క్యారెట్లు ఫైబర్ కు మంచి మూలం. 100 గ్రాముల బ్లాక్ క్యారెట్లలో 2.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది అలాగే మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శీతాకాలంలో క్రమం తప్పకుండా బ్లాక్ క్యారెట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.

బ్లాక్ క్యారెట్లు కంటి చూపుకు మేలు చేస్తాయి

నల్ల క్యారెట్లను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నల్ల క్యారెట్లలో ఆంథోసైనిన్లు, బీటా కెరోటిన్ ఉంటాయి, ఇవి దృష్టిని మెరుగుపరచడంలో, కంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us