Detox Drink: వధువు ఫేస్ అద్దంలా మెరిసిపోవాలా.. పెళ్ళికి ముందు రోజూ ఈ డ్రింక్ తో రోజుని మొదలు పెట్టండి

|

Aug 13, 2024 | 10:39 AM

పెళ్లిళ్ల సమయం దగ్గర పడుతుందనగా అమ్మాయిలు తమ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తారు. దీని కోసం ఇంటి నివారణల నుంచి కాస్మెటిక్ చికిత్సల వరకు ప్రతిదీ ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండటానికి శరీరం హైడ్రేట్, టాక్సిన్ రహితంగా ఉండటం ముఖ్యం. కనుక కాబోయే పెళ్లికూతురు ముఖం ఆరోగ్యంగా కనిపించడం మరింత ముఖ్యం. అటువంటి పానీయం ఒకటి ఉంది. ఇది వధువు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Detox Drink: వధువు ఫేస్ అద్దంలా మెరిసిపోవాలా.. పెళ్ళికి ముందు రోజూ ఈ డ్రింక్ తో రోజుని మొదలు పెట్టండి
Detox Drink
Follow us on

ప్రతి ఒక్కరూ పెళ్లిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. వధువు కాబోతున్న అమ్మాయి అయితే ఆమె తన రూపాన్ని గురించి చాలా ఆందోళన చెందుతుంది. పెళ్లి రోజున అందరి చూపు పెళ్లికూతురుపైనే ఉంటుంది. అందుకే ప్రతి అమ్మాయి పెళ్లి రోజు చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం మేకప్, ఆభరణాలు, దుస్తులతో పాటు, ముఖం శుభ్రంగా అందంగా కనిపించాలి అనుకుంటుంది.

పెళ్లిళ్ల సమయం దగ్గర పడుతుందనగా అమ్మాయిలు తమ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తారు. దీని కోసం ఇంటి నివారణల నుంచి కాస్మెటిక్ చికిత్సల వరకు ప్రతిదీ ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండటానికి శరీరం హైడ్రేట్, టాక్సిన్ రహితంగా ఉండటం ముఖ్యం. కనుక కాబోయే పెళ్లికూతురు ముఖం ఆరోగ్యంగా కనిపించడం మరింత ముఖ్యం. అటువంటి పానీయం ఒకటి ఉంది. ఇది వధువు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పానీయం చేయడానికి కావాల్సిన పదార్ధాలు

చర్మాన్ని గాజులా మెరిసేలా చేసే పానీయాన్ని తయారుచేయడానికి

ఇవి కూడా చదవండి

పచ్చి పసుపు (సన్నగా లేదా తురిమినవి)

అల్లం (తరిగినవి)

ఒక బీట్‌రూట్ (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం రసం (ఒక చెంచా)

నిమ్మకాయ(తరిగినవి)

జీలకర్ర పొడి (ఒక టీస్పూన్ )

దాల్చిన చెక్క పొడి ( ఒక టీస్పూన్)

ఈ విధంగా పానీయం సిద్ధం చేయండి

ముందుగా ఒక గాజు పాత్రలో ఫిల్టర్ చేసిన నీటిని తీసుకుని అందులో బీట్‌రూట్, పసుపు, అల్లం, అల్లం రసం, నిమ్మకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ జీలకర్ర పొడి, సమాన పరిమాణంలో దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఈ పానీయాన్ని కవర్ చేసి రాత్రంతా వదిలివేయండి. ఈ పానీయంతో రోజుని ప్రారంభించండి. కావాలంటే రోజులో ఎప్పుడైనా ఈ డ్రింక్ తాగవచ్చు.

ఏ ప్రయోజనాలను పొందుతారంటే?

ఈ డ్రింక్‌ని రోజూ తాగడం వల్ల చర్మం మీద మచ్చలు, మొటిమలు తగ్గిపోయి క్రమంగా చర్మం మెరుస్తుంది. అంతేకాదు ఈ పానీయం శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది మీ కాలేయం, జీర్ణక్రియ, ప్రేగుల ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్‌ని రోజూ తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.