Clothes Stains: మీ దుస్తులపై కాఫీ, టీ, సిరా వంటి మరకలు ఉన్నాయా.. ఇంటి వస్తువులతోనే పోగొట్టుకోండి ఇలా..

|

Sep 17, 2024 | 11:06 AM

బట్టలపై మరకలు పడటంవలన ఖరీదైన, ఇష్టమైన దుస్తులను ధరించలేరు. దీంతో చాలా నిరాస చెందుతారు. ఇబ్బంది పడతారు. అలాంటి సమయంలో బట్టలపై మరకలను పోగొట్టుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాంటి సమయంలో దుస్తులపై మరకలను చౌకగా సులభంగా తొలగించాలనుకుంటే ఈ సహజమైన వస్తువులను ఉపయోగించ్చును. అవి ఏమిటో తెలుసుకుందాం..

Clothes Stains: మీ దుస్తులపై కాఫీ, టీ, సిరా వంటి మరకలు ఉన్నాయా.. ఇంటి వస్తువులతోనే పోగొట్టుకోండి ఇలా..
Stain Clothes
Follow us on

ఇంట్లో పని చేస్తున్నప్పుడు లేదా ఒకొక్కసారి తింటున్నప్పుడో, తాగుతున్నప్పుడో .. ఏదైనా పని చేస్తున్నప్పుడో బట్టలపై టీ, కాఫీ, కూర వంటివి పడి తడవడమే కాదు మరకలు కూడా ఏర్పడతాయి. ఇలాంటి మరకలను ఒకొక్కసారి చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు.. అయితే కొన్ని సార్లు మాత్రం డిటర్జెంట్‌ పెట్టి ఉతికినా దుస్తులు శుభ్రం పడవు. దుస్తులపై కొన్ని రకాల మరకలు బలంగా ఉంటాయి. అప్పుడు ఎంత ఇష్టమైన ఖరీదైన చొక్కా, చీర లేదా టాప్ ఏదైనా సరే పాడైపోతుంది. ఓ పక్కకు పెట్టాల్సి వతుంది. ఖరీదైన దుస్తులు అయినా సరే మరకలు పడితే వాటిని ధరించలేము. టీ, కాఫీ, కూరలు లేదా సిరా మరకలు ఉన్న అలాంటి బట్టలు మీ దగ్గర కూడా ఉంటే ఖరీదైన డిటర్జెంట్ పొడర్ లేదా సబ్బుకు బదులుగా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సింపుల్ లో పోగొట్టుకోవచ్చు.

బట్టలపై మరకలు పడటంవలన ఖరీదైన, ఇష్టమైన దుస్తులను ధరించలేరు. దీంతో చాలా నిరాస చెందుతారు. ఇబ్బంది పడతారు. అలాంటి సమయంలో బట్టలపై మరకలను పోగొట్టుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాంటి సమయంలో దుస్తులపై మరకలను చౌకగా సులభంగా తొలగించాలనుకుంటే ఈ సహజమైన వస్తువులను ఉపయోగించ్చును. అవి ఏమిటో తెలుసుకుందాం..

కూరల మరకలు పోవాలంటే ఏం చేయాలంటే

దుస్తులపై కూరల మరక ఉంటే.. ఆపై మరకపై కొన్ని చుక్కల వైట్ వెనిగర్ వేసి, ఆపై పైన బేకింగ్ సోడా వేయండి. లేదా ఈ రెండు వస్తువులను కూడా పేస్ట్ చేసి దుస్తులపై ఉన్న మరకలపై అప్లై చేసుకోవచ్చు. దీని తరువాత కొన్ని నిమిషాల పాటు ఆ దుస్తులను అలా విడిచి పెట్టాలి. తర్వాత మరకని మెత్తగా రుద్దుతూ మరకను శుభ్రం చేసి.. తర్వాత సాధారణ ఉష్ణోగ్రత నీటితో కడగాలి. కూరల మరకలను తొలగించడానికి నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

సిరా మరకలు పోవాలంటే ఈ పనులు చేయండి

పెన్నులు తరచుగా పిల్లల బట్టలు మీద పడిపోతూ ఉంటాయి. అప్పుడు సిరా మరకలు దుస్తులపై పడతాయి. అటువంటి పరిస్థితిలో ఈ సాధారణ ట్రిక్ ప్రయత్నించాలి. ఇంట్లో పెర్ఫ్యూమ్ ఉంటే, గుడ్డపై సిరా పడిన ప్రదేశంలో రెండు మూడు సార్లు స్ప్రే చేసి.. ఆ మరకపై సున్నితంగా రుద్దడం ద్వారా శుభ్రం చేయండి. అంతేకాదు ఇంకు మరకలను తొలగించడానికి హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు. సిరా మరక పడిన చోట బేకింగ్ సోడా (సోడా పౌడర్ కాదని గమనించండి) కొద్దిగా చల్లటి నీటితో కలిపి పేస్ట్ లాగా చేసి,.. దానిని కాటన్ బాల్ మీద అప్లై చేసి.. సున్నితంగా చేతులతో తొలగించండి. ఈ చిట్కా పాటించే సమయంలో సిరా మరక వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించండి.

టీ లేదా కాఫీ మరకలను ఎలా తొలగించాలి

టీ లేదా కాఫీ ఏదైనా సరే దుస్తులపై చిందినట్లయితే.. వెంటనే శుభ్రం చేయడానికి ప్రయత్నించండి. అంతేకాదు నిమ్మ రసం, తెలుపు వెనిగర్ ని కలిపి ఈ మిశ్రమంతో టీ, కాఫీ మరకలను శుభ్రం చేయండి. అయితే ఈ చిట్కా అప్లై చేసే సమయంలో బట్టల నాణ్యత దృష్టిలో పెట్టుకోవాలి. బట్టల నాణ్యత బాగుండాలని నిర్ధారించుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..