
యాలకులు ప్రతి వంటింట్లోనూ ఉండే మసాలా దినుసు. అయితే, యాలకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, వంటకాలకు మంచి సువాసనను అందిస్తాయని మనందరికీ తెలుసు. కానీ, ఇందులో పెద్ద యాలకులు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇవి కాస్తా నలుపు రంగులో ఉంటాయి. ఈ నల్ల యాలకులు తీసుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి, పొటాషియం, మొదలైన ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి.
నల్ల యాలకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. నల్ల యాలకులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
నల్ల యాలకులు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, పళ్ళ నొప్పులు, చిగుళ్ళ వ్యాధుల నుండి రక్షిస్తాయి. నల్ల యాలకులు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. నల్ల యాలకులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తపోటును నియంత్రిస్తాయి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..